శ్రీరక్షకుండు పుట్టగా - నాకాశ సైన్యము
1. శ్రీరక్షకుండు పుట్టగా - నాకాశ సైన్యము
ఇహంబున కేతెంచుచు - ఈ పాట పాడెను
పరంబునందు స్వామికి - మహా ప్రభావము
ఇహంబునందు శాంతిని - వ్యాపింపనీయుడు
2. ఆ రమ్యమైన గానము - ఈవేళ మ్రోగును
సంతుష్టులైన భక్తులు - ఆ ధ్వని విందురు
ప్రయాసపడు ప్రజల - దుఃఖంబు తీరగా
ఆ శ్రావ్యమైన గానము - ఈవేళ విందురు
3. పూర్వంబు దూతగానము - భువిన్ వినంబడి
రెండువేల వర్షములు - గతించిపోయెను
భూ ప్రజలు విరోధులై - యుద్ధంబులాడి యా
మనోజ్ఞమైన గానము - నలక్ష్య పెట్టిరి
4. పాపాత్ములారా వినుడి - శ్రీ యేసుప్రభువు
మీ పాపభారమంతయు - వహింప వచ్చెను
తాపత్రయంబు నంతయు - దానే వహించును
సంపూర్ణ శాంతి సంపద - లను గ్రహించును
5. సద్భక్తులు స్తుతించిన - ఈ సత్యయుగము
ఈవేళనే నిజంబుగా - సమీపమాయెను
ఆ కాలమందు క్షేమము - వ్యాపించుచుండును
ఆ దివ్య గానమందరు - పాడుచు నెప్పుడు
1. shreerakshakundu puttagaa - naakaasha sainyamu
ihambuna ketenchuchu - ee paata paadenu
parambunandu svaamiki - mahaa prabhaavamu
ihambunandu shaantini - vyaapimpaneeyudu
2. aa ramyamaina gaanamu - eevela mrogunu
santushtulaina bhaktulu - aa dhvani vinduru
prayaasapadu prajala - duhkhambu teeragaa
aa shraavyamaina gaanamu - eevela vinduru
3. poorvambu dootagaanamu - bhuvin vinambadi
renduvela varshamulu - gatinchipoyenu
bhoo prajalu virodhulai - yuddhambulaadi yaa
manojnyamaina gaanamu - nalakshya pettiri
4. paapaatmulaaraa vinudi - shree yesuprabhuvu
mee paapabhaaramantayu - vahimpa vachchenu
taapatrayambu nantayu - daane vahinchunu
sampoorna shaanti sampada - lanu grahinchunu
5. sadbhaktulu stutinchina - ee satyayugamu
eevelane nijambugaa - sameepamaayenu
aa kaalamandu kshemamu - vyaapinchuchundunu
aa divya gaanamandaru - paaduchu neppudu
Comments
Post a Comment