సమయమిదే - సమయమిదే - సంఘమ సమయమిదే

సమయమిదే - సమయమిదే - సంఘమ సమయమిదే
సీయోనులో చేరుటకు - సంఘమా సమయమిదే    ॥సమయ||


1. చూడుము భూమిమీద - పాప చీకటి కమ్మియున్నది
    జ్యోతివలె జీవించుము - జీవవాక్యము పట్టుకొని        ||సమ||


2. ధూళి దులుపుకొనుము - నీవు మెడకట్లు విప్పుకొనుము
    సుందరమైన వస్త్రము - వేగము ధరించి సిద్ధపడుము     ||సమ||


3. నిలువుము సత్యముకై - సువార్తకై పోరాడుము
సేవను చేసి నీవు - త్యాగముచేయుము ప్రాణమును   ||సమ||


4. సీయోను శత్రువులు - సిగ్గుపడుదురు నిశ్చయముగా
    సీయోను నీ పరుగు - తుదముట్టించుము త్వరితముగా    ||సమ||


5. సీయోనులో వసియించు - సర్వశక్తుడు నీ ద్వారా శోధింప
    ఈ దినము - మార్పునొందుము స్పటికముగా                ||సమ||


6. పిలుపుకు తగినట్లుగా - నీవు నడువుము ప్రభుయేసుతో
    ప్రేమలోనే నిలువుము - నిత్యజీవము చేపట్టుము           ||సమ||


7. సీయోను రారాజు - నిన్ను చూచి ఏతెంచును
    మహిమగల కిరీటము - నీకు ఆయన ఇచ్చును           ||సమ||


Samayamide - samayamide - sanghama samayamide 

Seeyonulo cherutaku - sanghamaa samayamide    ॥samaya||


1. choodumu bhoomimeeda - paapa cheekati kammiyunnadi 

    jyotivale jeevinchumu - jeevavaakyamu pattukoni        ||sama||


2. dhooli dulupukonumu - neevu medakatlu vippukonumu 

    sundaramaina vastramu - vegamu dharinchi siddhapadumu ||sama||


3. niluvumu satyamukai - suvaartakai poraadumu 

Sevanu chesi neevu - tyaagamucheyumu praanamunu   ||sama||


4. seeyonu shatruvulu - siggupaduduru nishchayamugaa

    seeyonu nee parugu - tudamuttinchumu tvaritamugaa    ||sama||


5. seeyonulo vasiyinchu - sarvashaktudu nee dvaaraa shodhimpa 

    ee dinamu - maarpunondumu spatikamugaa                ||sama||


6. pilupuku taginatlugaa - neevu naduvumu prabhuyesuto 

    premalone niluvumu - nityajeevamu chepattumu           ||sama||


7. seeyonu raaraaju - ninnu choochi etenchunu 

    mahimagala kireetamu - neeku aayana ichchunu           ||sama||


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు