స్తోత్రింతుము నిను మాదు తండ్రి-సత్యముతో ఆత్మతో

స్తోత్రింతుము నిను మాదు తండ్రి-సత్యముతో ఆత్మతో నెపుడు
పరిశుద్ధాలంకారములతో - దర్శించెదము శరణం, శరణం


1. శ్రేష్టయీవుల యూట నీవె - శ్రేష్టకుమారుని యిచ్చినందున

    త్రిత్వమై యేకత్వమైన త్రి - లోకనాధా శరణం శరణం


2. పాపిమిత్రుడ పాపనాశక - పరమవాసా ప్రేమపూర్ణా
  వ్యోమపీఠుడా స్వర్ణమయుడా - పరిశుద్ధాంగుడా శరణం శరణం


3. ధవళవర్ణుడ రత్నవర్ణుడ - సత్యరూపి యనబడువాడా
    నను రక్షించిన రక్షకుండా - నాధా నీకే శరణం శరణం


4. బంగరు వెంట్రుకలు తలపై - ఉంగరములుగ కనబడుచున్నవి
    పదివేలలో నతి కాంక్షనీయుడా - వేలకొలది శరణం శరణం


5. గువ్వలవంటి కన్నులు - పువ్వులవంటి చెక్కిళ్ళు
    మంచిరూపము కల్గినందున - మాకు నీవే శరణం శరణం


6. చేతులు బంగారుమయము - చెక్కిన రత్నముల వంటివి
    కాళ్ళు రాతి స్తంభములవలె - కన్పడుచున్నందున శరణం


7. సంఘములకు శిరస్సు నీవే - రాజ నీకే నమస్కారములు
    ముఖ్యమైన మూలరాయి - కోట్లకొలది శరణం శరణం


8. నీదు సేవకుల పునాది - జ్ఞానమునకు మించిన తెలివి
    అందముగను కూడుకొనుచు - వేడుకొందుము శరణం శరణం


9. రాజ నీకే స్తుతి స్తోత్రములు - గీతములు మంగళధ్వనులు
    శుభము శుభము శుభము నిత్యము - హల్లెలూయ ఆమెన్ ఆమెన్ 


Stotrintumu ninu maadu tandri-
satyamuto aatmato nepudu 

Parishuddhaalankaaramulato -
darshinchedamu sharanan, sharanam


1. shreshtayeevula yoota neeve -
    shreshtakumaaruni yichchinanduna

    tritvamai yekatvamaina tri -
    lokanaadhaa sharanam sharanam


2. paapimitruda paapanaashaka -
    paramavaasaa premapoornaa 

   vyomapeethudaa svarnamayudaa -
  parishuddhaangudaa sharanam sharanam


3. dhavalavarnuda ratnavarnuda -
    satyaroopi yanabaduvaadaa 

    nanu rakshinchina rakshakundaa -
  naadhaa neeke sharanam sharanam


4. bangaru ventrukalu talapai -
    ungaramuluga kanabaduchunnavi 

    padivelalo nati kaankshaneeyudaa -
    velakoladi sharanam sharanam


5. guvvalavanti kannulu -
    puvvulavanti chekkillu 

     manchiroopamu kalginanduna -
    maaku neeve sharanam sharanam


6. chetulu bangaarumayamu -
    chekkina ratnamula vantivi 

    kaallu raati stambhamulavale -
    kanpaduchunnanduna sharanam


7. sanghamulaku shirassu neeve -
  raaja neeke namaskaaramulu 

    mukhyamaina moolaraayi -
    kotlakoladi sharanam sharanam


8. needu sevakula punaadi -
    jnyaanamunaku minchina telivi

    andamuganu koodukonuchu -
    vedukondumu sharanam sharanam


9. raaja neeke stuti stotramulu -
    geetamulu mangaladhvanulu 

    shubhamu shubhamu shubhamu nityamu -
    hallelooya aamen aamen 

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు