యేసుని స్వీకరించు - క్రీస్తేసుని స్వీకరించు

యేసుని స్వీకరించు - క్రీస్తేసుని స్వీకరించు
నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితముతానే ప్రవేశించును


1. కనికరమందైశ్వర్యుండు నిను వాత్సల్యముతో విమోచించును
    భయంకరమైన పాపమునుండి విడిపింప నిన్ను వెదకివచ్చె    ॥యేసుని॥


2. మన్నించు సర్వపాపములన్ - తానే మాన్పును సర్వ రోగములన్
    కృప కనికరముల మకుటము నీకు ధరియింపజేసి ఘనపరచున్   ॥యేసుని॥


3. అంధులకు దృష్టికలుగజేసె - అంగహీనులను లేపి నడువజేసెన్
    పలువిధములగు వ్యాధిగ్రస్తులకు స్వస్థతనిచ్చెను తక్షణమే      ॥యేసుని॥


4. పాపపు భారము భరియించెన్ - నీ రోగములన్నిటి తొలగించెన్
    సహించెను కొరడా దెబ్బల బాధను జయించెను అన్ని శోధనలన్   ॥యేసుని॥


5. కలువరి సిలువలో వ్రేలాడి తన రక్తము చిందించే ధారలుగా
    చేతులలో తన కాళ్ళలో సీలలు ముండ్ల కిరీటము ధరియించెన్     ॥యేసుని||


6. జీవమిచ్చుటకు ప్రాణమిడె - మరి జయించెను ప్రతివిధ శోధనలు
    నీ కొరకై మరణించి లేచెను - శక్తిమంతుడై నిను రక్షింప              ॥యేసుని॥


Yesuni sveekarinchu - kreestesuni sveekarinchu 

Nee hrudayapu dvaaramu teruvumu tvaritamutaane praveshinchunu


1. kanikaramandaishvaryundu ninu vaatsalyamuto vimochinchunu 

    bhayankaramaina paapamunundi vidipimpa ninnu vedakivachche    ॥yesuni॥


2. manninchu sarvapaapamulan - taane maanpunu sarva rogamulan 

    krupa kanikaramula makutamu neeku dhariyimpajesi ghanaparachun   ॥yesuni॥


3. andhulaku drushtikalugajese - angaheenulanu lepi naduvajesen 

    paluvidhamulagu vyaadhigrastulaku svasthatanichchenu takshaname      ॥yesuni॥


4. paapapu bhaaramu bhariyinchen - nee rogamulanniti tolaginchen 

    sahinchenu koradaa debbala baadhanu jayinchenu anni shodhanalan   ॥yesuni॥


5. kaluvari siluvalo vrelaadi tana raktamu chindinche dhaaralugaa 

    chetulalo tana kaallalo seelalu mundla kireetamu dhariyinchen     ॥yesuni||


6. jeevamichchutaku praanamide - mari jayinchenu pratividha shodhanalu 

    nee korakai maraninchi lechenu - shaktimantudai ninu rakshimpa              ॥yesuni॥ 

Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో