శాశ్వతుడా! విస్మయమొంది నేను - నీ స్వంత హస్త సృష్టి జూడగా

1. శాశ్వతుడా! విస్మయమొంది నేను - నీ స్వంత హస్త సృష్టి జూడగా
    నీ స్వరం విందున్ ఉరుముల యందు - యేసు ప్రభూ నిన్నారాధింతును


॥ ఓ రక్షకా! నీ స్తుతి పాడెదన్ నూరంతలన్ మహాదేవా
    నా రక్షకా! నమస్కరింతునిన్ మారనియో మహాదేవా ॥


2. వృక్షంబులందున్ అడవులలో నే - పక్షులపాట లాలకింతును త
    క్షణ మగ్రపర్వతంబు నుండి - అక్షులతో నీ మహిమ గందున్


3. మహాదేవ నీ యేకపుత్రుండిలన్ - నా హేయపాపముల్ భరించి నా
    సహాయుడై తామరణించె నంచు - ఓహో! యాశ్చర్యపడి స్మరింతున్


4. క్రీస్తు విజయార్భాటముతో వచ్చి - నీ స్థలమందు నన్ను చేర్చగా
    నే స్థిరతుష్టితో సాష్టాంగపడి - నీ స్తుతిజేతునో మహాదేవా


1. shaashvatudaa! vismayamondi nenu - nee svanta hasta srushti joodagaa 

    nee svaram vindun urumula yandu - yesu prabhoo ninnaaraadhintunu


॥ o rakshakaa! nee stuti paadedan noorantalan mahaadevaa 

    naa rakshakaa! namaskarintunin maaraniyo mahaadevaa ॥


2. vrukshambulandun adavulalo ne - pakshulapaata laalakintunu ta

    kshana magraparvatambu nundi - akshulato nee mahima gandun


3. mahaadeva nee yekaputrundilan - naa heyapaapamul bharinchi naa 

    sahaayudai taamaraninche nanchu - oho! yaashcharyapadi smarintun


4. kreestu vijayaarbhaatamuto vachchi - nee sthalamandu nannu cherchagaa 

    ne sthiratushtito saashtaangapadi - nee stutijetuno mahaadevaa 


Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో