స్తుతియు మహిమ ఘనత నీకే

స్తుతియు మహిమ ఘనత నీకే
యుగయుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా


1. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము
    మేమందరము ఉత్సహించి సంతోషించెదము
    కొనియాడెదము మరువబడని మేలులు జేసెనని    ॥స్తుతియు॥


2. నీ ఒక్కడవే గొప్ప దేవుడవు ఘనకార్యములు జేయుదువు
    నీదు కృపయే నిరంతరము నిలిచియుండునుగా
    నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము      llస్తుతియుll


3. నూతనముగ దినదినము నిలుచు నీదు వాత్సల్యతమాపై
    ఖ్యాతిగా నిలిచే నీ నామమును కీర్తించెదమెప్పుడు
    ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా  ॥స్తుతియు॥


4. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి
    జీవమునిచ్చి నడిపించెదవు నీ ఆత్మ ద్వారా
    సేవించెదము సమ భూమిగల ప్రదేశములో నిన్ను   ॥స్తుతియు॥


Stutiyu mahima ghanata neeke 

Yugayugamula varaku ento nammadagina devaa


1. maa devudavai maakichchitivi
  ento goppa shubhadinamu 

   memandaramu utsahinchi
  santoshinchedamu 

   koniyaadedamu maruvabadani
  melulu jesenani    ॥stutiyu॥


2. nee okkadave goppa devudavu
    ghanakaaryamulu jeyuduvu 

    needu krupaye nirantaramu
    nilichiyundunugaa 

    ninnu memu aanandamuto
    aaraadhinchedamu      llstutiyull


3. nootanamuga dinadinamu
    niluchu needu vaatsalyatamaapai 

    khyaatigaa niliche nee naamamunu
    keertinchedameppudu 

    preetito maa stutularpinchedamu
    daakshinya prabhuvaa  ॥stutiyu॥


4. neeve maaku parama prabhudavai nee chittamu neraverchitivi 

     jeevamunichchi nadipinchedavu nee aatma dvaaraa 

     sevinchedamu sama bhoomigala pradeshamulo ninnu   ॥stutiyu॥ 


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు