సమర్పింతునయ్యా సంపూర్తిగా అద్భుత నాధా

1. సమర్పింతునయ్యా సంపూర్తిగా అద్భుత నాధా నీ కరములలో
    సర్వము నీకే సొంతముగా - నా ప్రియుడా నీకే అంకితము


అ. ప.   సర్వము క్రీస్తునకే నా సర్వము అంకితమే
          శక్తి సామర్థ్య వాంఛలు - సర్వము క్రీస్తునకే


2. స్వేచ్ఛా వీధులలో సంచరించి - అడ్డులేని బ్రతుకు జీవించితి
    నీ సిలువ ప్రేమను కనుగొంటిని - కూలితి నీ పాదపద్మములపై    ॥సర్వము॥


3. పంచేంద్రియముల నణచెడి - పంచగాయముల పొందితివే
    భూమి ఆకాశ గ్రహములను - ఏలెడి రేడా నన్నేలుమా           ॥సర్వము॥


4. ఎన్నెన్నో దీవెనల కోల్పోతినే - శేషించిన రోజులలో సేవ చేతున్
    నీ వలన పొందిన ఈవులను - నీ సేవ బలపడ సమర్పింతున్   ॥సర్వము॥


1. samarpintunayyaa sampoortigaa adbhuta naadhaa nee karamulalo 

    sarvamu neeke sontamugaa - naa priyudaa neeke ankitamu


A. pa.   sarvamu kreestunake naa sarvamu ankitame

            shakti saamarthya vaanchhalu - sarvamu kreestunake


2. svechchhaa veedhulalo sancharinchi - adduleni bratuku jeevinchiti 

    nee siluva premanu kanugontini - kooliti nee paadapadmamulapai    ॥sarvamu॥


3. panchendriyamula nanachedi - panchagaayamula ponditive

    bhoomi aakaasha grahamulanu - eledi redaa nannelumaa           ॥sarvamu॥


4. ennenno deevenala kolpotine - sheshinchina rojulalo seva chetun 

    nee valana pondina eevulanu - nee seva balapada samarpintun   ॥sarvamu॥ 

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు