యేసును స్తుతియించువారు - నిత్యజీవము పొందెదరు

యేసును స్తుతియించువారు - నిత్యజీవము పొందెదరు
ఆనందముతో దిన దినము - సంతోషముతో నుందురు


1. వాడబారని ఆకువలె - దినదినము బలమొందెదరు
    జీవజలముల నది యొడ్డున - వృక్షములవలె పెరిగెదరు
    అ…….హల్లెలూయ (3) llయేసునుll

2. చీకటి నుండి వెలుగునకు - మరణము నుండి జీవముకు
    చేయి విడువక తనతో కూడా యేసే నడిపించును
    అ…….హల్లెలూయ (3) llయేసునుll

3. చీకు చింతలు కలిగినను - చెరలు దుఃఖము కలిగినను
    కనురెప్ప వలె కాపాడి - యేసే నడిపించును
      అ…….హల్లెలూయ (3) llయేసునుll


4. నడిసంద్రములో పయనించినా - నట్టడవులలో నివసించినా
    ఎన్నడు విడువక ఎడబాయకను - యేసే తోడుండును
      అ…….హల్లెలూయ (3) llయేసునుll


Yesunu stutiyinchuvaaru - nityajeevamu pondedaru 

Aanandamuto dina dinamu - santoshamuto nunduru


1. vaadabaarani aakuvale - dinadinamu balamondedaru 

    jeevajalamula nadi yodduna - vrukshamulavale perigedaru 

    a…….hallelooya (3) llyesunull


2. cheekati nundi velugunaku - maranamu nundi jeevamuku 

    cheyi viduvaka tanato koodaa yese nadipinchunu 

    a…….hallelooya (3) llyesunull


3. cheeku chintalu kaliginanu - cheralu duhkhamu kaliginanu 

    kanureppa vale kaapaadi - yese nadipinchunu 

      a…….hallelooya (3) llyesunull


4. nadisandramulo payaninchinaa - nattadavulalo nivasinchinaa 

     ennadu viduvaka edabaayakanu - yese todundunu 

      a…….hallelooya (3) llyesunull 

Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో