సంతోషముతో నిచ్చెడు వారిని - నెంతో దేవుడు ప్రేమించున్
సంతోషముతో నిచ్చెడు వారిని - నెంతో దేవుడు ప్రేమించున్ =
వింతగ వలసిన - దంతయు నొసగును - వినయ మనసుగల విశ్వాసులకును
1. అత్యాసక్తితో నధిక ప్రేమతో - నంధకార జనులందరకు
సత్యసువార్తను - జాటించుటకై -
సతతము దిరిగెడు సద్భక్తులకు ॥సంతో॥
2. వేదవాక్యమును వేరువేరు గ్రా - మాదుల నుండెడు బాలురకు =
సాధులు ప్రభుని సు - బోధలు నేర్పెడి -
సజ్జన క్రైస్తవోపాధ్యాయులకు ॥సంతో॥
3. దిక్కెవ్వరు లేకుండెడి దీనుల - తక్కువ లన్నిటిదీర్చుటకై =
నిక్కపు రక్షణ - నిద్దరలో నలు ప్రక్కలలో బ్రక - టించుట కొరకై ॥సంతో॥
4. ఇయ్యండీ మీ కీయం బడునని - యియ్యంగల ప్రభు యేసనెను =
ఇయ్యది మరువక - మదిని నుంచుకొని యియ్యవలెను
మన - యీవుల నికను ॥సంతో॥
5. భక్తిగలిగి ప్రభు పని కిచ్చుట బహు - యుక్త మటంచు ను - దారతతో -
శక్తికొలది మన భుక్తి నుండి యాసక్తితో నిరతము - నియ్యవలెను ॥సంతో॥
Santoshamuto nichchedu vaarini - nento devudu preminchun =
Vintaga valasina - dantayu nosagunu - vinaya manasugala vishvaasulakunu
1. atyaasaktito nadhika premato - nandhakaara janulandaraku
satyasuvaartanu - jaatinchutakai - satatamu dirigedu sadbhaktulaku ॥santo॥
2. vedavaakyamunu veruveru graa - maadula nundedu baaluraku =
saadhulu prabhuni su - bodhalu nerpedi - sajjana kraistavopaadhyaayulaku ॥santo॥
3. dikkevvaru lekundedi deenula - takkuva lannitideerchutakai =
nikkapu rakshana - niddaralo nalu prakkalalo braka - tinchuta korakai ॥santo॥
4. iyyandee mee keeyam badunani - yiyyangala prabhu yesanenu =
iyyadi maruvaka - madini nunchukoni yiyyavalenu mana - yeevula nikanu ॥santo॥
5. bhaktigaligi prabhu pani kichchuta bahu - yukta matanchu nu - daaratato -
shaktikoladi mana bhukti nundi yaasaktito niratamu - niyyavalenu ॥santo॥
Comments
Post a Comment