సువార్త దళం విజయధ్వజం - ఎత్తుము నేడే
సువార్త దళం విజయధ్వజం - ఎత్తుము నేడే
ప్రభు యేసు ముందు నడువ - సాగుము నేడే
1. ఇనుప గడియలారా మీరు ఎదిరింతురా
ఇత్తడి తలుపులారా మీరు మూసుకుందురా
ఇనుప గడియలు - ఇత్తడి తలుపులు తెరువబడి
సువార్తదళం - సాగు ముందుకు ॥సువార్త॥
2. పురాతన తలుపులారా - లేచి నిలువుడి - మహిమగల రాజు
మీలో ప్రవేశించును వెలుగు కలుగును - జీవమబ్బును -
రారాజై మిమ్ములను - నిత్యమేలును ॥సువార్త॥
3. మహిమగల యీ రాజు - ఎవ్వరందురా - సర్వశక్తిమంతుడగు
శ్రీ యేసుడే మృత్యుంజయుడు - పాపుల రక్షకుడు
నీ కొరకై దీవిని విడచి - భువికి వచ్చెను ॥సువార్త॥
4. యువతి యువకులారా మీరు ధ్వజము నెత్తుడి
సువార్త చాటు భారమింక - మీదే యెరుగుడి
మిషనులు వద్దు - గ్రూపులు వద్దు -
క్రీస్తు ప్రేమ బంధముతో సాగుముందుకు ॥సువార్త॥
Suvaarta dalam vijayadhvajam - ettumu nede
Prabhu yesu mundu naduva - saagumu nede
1. inupa gadiyalaaraa meeru edirinturaa
ittadi talupulaaraa meeru moosukunduraa
inupa gadiyalu - ittadi talupulu teruvabadi
suvaartadalam - saagu munduku ॥suvaarta॥
2. puraatana talupulaaraa - lechi niluvudi -
mahimagala raaju meelo praveshinchunu
velugu kalugunu - jeevamabbunu -
raaraajai mimmulanu - nityamelunu ॥suvaarta॥
3. mahimagala yee raaju - evvaranduraa -
sarvashaktimantudagu shree yesude mrutyunjayudu -
paapula rakshakudu nee korakai deevini
vidachi - bhuviki vachchenu ॥suvaarta॥
4. yuvati yuvakulaaraa meeru dhvajamu nettudi
suvaarta chaatu bhaaraminka - meede yerugudi
mishanulu vaddu - groopulu vaddu -
kreestu prema bandhamuto saagumunduku ॥suvaarta॥
Comments
Post a Comment