స్వచ్ఛంద సీయోనువాసి - సర్వాధికారి కస్తూరి పూరాసి
స్వచ్ఛంద సీయోనువాసి - సర్వాధికారి కస్తూరి పూరాసి
వర్తమాన భూత భవిష్యత్కాల వాసి (2)
అల్ఫ ఓమేగ తానే (2) ఆద్యంతము మన యేసే (2) ll స్వచ్ఛll
1. ఇదిగో నేనొక నిబంధనను - అద్భుతముల జేతున్ నీ ప్రజలందరి
యెదుట - పరిశోధింపజాలని మహా - పనులెల్ల ప్రభువే
లెక్కలేని యద్భుతముల్ - మక్కువతో చేయువాడు ll స్వచ్ఛll
2. సంగీత నాదములతోడ - సీయోను పురము-సొంపుగను చేరితిమి
శాశ్వత సంతోషము మా - శిరములపై వెలసెన్ దుఃఖము
నిట్టూర్పును పోయెను - మిక్కిలి ఆనందము గల్గెన్ ll స్వచ్ఛll
3. నీలముల పునాదులు వేసి - నీలాంజనములతో - మాణిక్య
మణులతో సువర్ణ సునీయముల - సూర్యకాంతముతో ప్రశస్త
రత్నములతో - ప్రవిమలముగ నిను గట్టెదను ॥స్వచ్ఛ॥
4. సుమముల హారము సంతోషానంద తైలము నీదే
స్తుతి వస్త్రము నీదే ఉల్లాస వస్త్రంబు నీదే విడుదలయు నీదే
హితవత్సరము విముక్తి అత్మాభిషేకము నీదే ll స్వచ్ఛll
5. జలములలోబడి దాటునప్పుడు - బలమై యుండెదను
నే తోడై యుండెదను - నదులలో బడి వెళ్లునప్పుడు - నీపై పారవు
అగ్ని మధ్యను నడచినను - జ్వాలలు నిను కాల్చగలేవు ll స్వచ్ఛll
6. ఇత్తడి తలుపులు పగులగొట్టెద - ఇనుప గడియలను
విడగొట్టెదను నేను - అంధకార స్థలములలో - నున్నట్టి నిధులను
రహస్యములో మరుగైన ధనమును నీ కొసంగెదను ll స్వచ్ఛll
7. గర్భమున పుట్టినది మొదలు - తల్లి ఒడిలోన కూర్చుండినది
మొదలు - నేను చంకబెట్టుకొన్న నాదు ప్రజలారా ముదిమి
వచ్చువరకు నిన్ను - ఎత్తుకొనువాడను నేనే ll స్వచ్ఛll
Svachchhanda seeyonuvaasi -
sarvaadhikaari kastoori pooraasi
Vartamaana bhoota bhavishyatkaala vaasi (2)
Alpha omega taane (2)
aadyantamu mana yese (2) ll svachchhall
1. idigo nenoka nibandhananu -
adbhutamula jetun nee prajalandari
yeduta - parishodhimpajaalani
mahaa - panulella prabhuve
lekkaleni yadbhutamul -
makkuvato cheyuvaadu ll svachchhall
2. sangeeta naadamulatoda -
seeyonu puramu-sompuganu cheritimi
shaashvata santoshamu maa -
shiramulapai velasen duhkhamu
nittoorpunu poyenu -
mikkili aanandamu galgen ll svachchhall
3. neelamula punaadulu vesi -
neelaanjanamulato - maanikya
manulato suvarna suneeyamula -
sooryakaantamuto prashasta
ratnamulato - pravimalamuga
ninu gattedanu ॥svachchha॥
4. sumamula haaramu
santoshaananda tailamu neede
stuti vastramu neede ullaasa
vastrambu neede vidudalayu neede
hitavatsaramu vimukti
atmaabhishekamu neede ll svachchhall
5. jalamulalobadi daatunappudu -
balamai yundedanu
ne todai yundedanu - nadulalo badi
vellunappudu - neepai paaravu
agni madhyanu nadachinanu -
jvaalalu ninu kaalchagalevu ll svachchhall
6. ittadi talupulu pagulagotteda -
inupa gadiyalanu
vidagottedanu nenu - andhakaara sthalamulalo -
nunnatti nidhulanu
rahasyamulo marugaina
dhanamunu nee kosangedanu ll svachchhall
7. garbhamuna puttinadi modalu -
talli odilona koorchundinadi
modalu - nenu chankabettukonna
naadu prajalaaraa mudimi
vachchuvaraku ninnu -
ettukonuvaadanu nene ll svachchhall
Comments
Post a Comment