యేసు, మమ్ము నడిపించు నీదు కాపుకావలెన్

1. యేసు, మమ్ము నడిపించు నీదు కాపుకావలెన్
    నీవు మమ్మును బోషించు - మమ్ము జేర్చుదొడ్డిలోన్
    యేసునాధా, ప్రియనాధా - మమ్ము విమోచించుమా (2)


2. మమ్ము నాదరించు యేసూ - మాకు పాలకుండవు
    పాపమార్గమందు నుండి - ప్రేమతో దప్పించుమీ
    యేసునాధా, ప్రియనాధా - మొర్ర నాలకించుమా (2)


3. బీద పాపులైన మమ్ము - నీవంగీకరింతువు
    మమ్మును బవిత్రపర్చి - మమ్ము విడిపించుమీ
    యేసునాధా, ప్రియనాధా - నిన్ను నాశ్రయింతుము (2)


4. బాల్యమందు నిన్నుజేరి - నిన్ను హత్తుకొందుము
    ప్రియరక్షకుండ, యేసూ - నీదుప్రేమ జూపుమా
    యేసునాధా ప్రియనాధా - మమ్మింక బ్రేమించుమా (2)


1. yesu, mammu nadipinchu needu kaapukaavalen 

    neevu mammunu boshinchu - mammu jerchudoddilon 

    yesunaadhaa, priyanaadhaa - mammu vimochinchumaa (2)


2. mammu naadarinchu yesoo - maaku paalakundavu 

    paapamaargamandu nundi - premato dappinchumee 

    yesunaadhaa, priyanaadhaa - morra naalakinchumaa (2)


3. beeda paapulaina mammu - neevangeekarintuvu 

    mammunu bavitraparchi - mammu vidipinchumee 

    yesunaadhaa, priyanaadhaa - ninnu naashrayintumu (2)


4. baalyamandu ninnujeri - ninnu hattukondumu 

    priyarakshakunda, yesoo - needuprema joopumaa 

    yesunaadhaa priyanaadhaa - mamminka breminchumaa (2) 

Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో