విజయంబు విజయంబు - విజయంబు మా యేసు
విజయంబు విజయంబు - విజయంబు మా యేసు నిజమె మృత్యువు
గెల్చి - నేడు వేంచేసె = యజమాను డెల్ల ప్ర - యాసము
లెడబాప - స్వజనుల రక్షింప - సమసె సిలువ మీద ||విజయ||
1. విజయంబు విజయంబు - విజయంబు మానవుల
వృజిన నివృత్తిని - విభు డొనరింపన్ = గుజనులచే
నతడు క్రూర మరణము నొంది - విజిత
మృత్యువు నుండి - విజయుండై వేంచేసె ||విజయ॥
2. విజయంబు విజయంబు - విజయంబు మా యేసు
భుజము మీదను మోయు - బరిపాలనంబు =
కుజము మీదను బ్రాణ - త్యజనము జేసెను -
ధ్వజము మోయుచు సిల్వ - పాప మోడింతము ||విజయ||
3. విజయంబు విజయంబు - విజయం బికను మా
క - పజయము కాకుండ బ్రభు యేసుక్రీస్తు =
సుజనత్వమున వైరి - వ్రజము గెల్వగజేసి
నిజముగ బరలోక - నిలయంబులో నిల్పు ||విజయ||
4. విజయంబు విజయంబు - విజయం బనెడి పాట
నిజభక్తితో మనము - నేర్చిన వాని భజియించుదము
భూ న - భములు తా బాలించు - అజిత
జీవ ప్రదు డమరత్వ మిడు మనకు ||విజయ||
Vijayambu vijayambu - vijayambu maa yesu nijame mrutyuvu
Gelchi - nedu venchese = yajamaanu della pra - yaasamu
Ledabaapa - svajanula rakshimpa - samase siluva meeda ||vijaya||
1. vijayambu vijayambu - vijayambu maanavula
vrujina nivruttini - vibhu donarimpan = gujanulache
natadu kroora maranamu nondi - vijita
mrutyuvu nundi - vijayundai venchese ||vijaya॥
2. vijayambu vijayambu - vijayambu maa yesu
bhujamu meedanu moyu - baripaalanambu =
kujamu meedanu braana - tyajanamu jesenu -
dhvajamu moyuchu silva - paapa modintamu ||vijaya||
3. vijayambu vijayambu - vijayam bikanu maa
ka - pajayamu kaakunda brabhu yesukreestu =
sujanatvamuna vairi - vrajamu gelvagajesi
nijamuga baraloka - nilayambulo nilpu ||vijaya||
4. vijayambu vijayambu - vijayam banedi paata
nijabhaktito manamu - nerchina vaani bhajiyinchudamu
bhoo na - bhamulu taa baalinchu - ajita
jeeva pradu damaratva midu manaku ||vijaya||
Comments
Post a Comment