స్తుతించెదను - స్తుతించెదను నా యేసుప్రభున్

స్తుతించెదను - స్తుతించెదను నా యేసుప్రభున్
కృతజ్ఞతతో - అనుదినము - స్తుతించెదను


1. ఉన్నత దేవుడు సర్వాధిపతియు - ఉర్విపరిపాలక ఉన్నతం విసర్జించి
    నన్ను వెదకిన - ఉత్తమ స్నేహితుని - ఉదయం సంధ్యా
    ఎల్లప్పుడును - ఉత్సాహధ్వనితో పాడెదను (2)     ||స్తుతి||


2. నాశనకరమైన పాప గుంటనుండి - నరక వేదననుండి
    నన్ను విడిపించి పిలిచిన దేవ - నిర్మల స్వరూప
    నీతి సమాధానం - సంతోషముతో - నిత్యజీవము నాకిచ్చితివి (2)  ॥స్తుతి॥


3. పాపము క్షమించి - రోగము బాపి - భయమును తీర్చి
    పవిత్రదాయక - పావనమూర్తి - పరిశుద్ధమిచ్చిన
    పరమపాదం - శరణ్యం నాకు - పరమ రాజ పుణ్యదేవ (2)      ||స్తుతి||

4. తల్లిగర్భమునకు - ముందేర్పరచి - దేహము నమర్చియును
    దక్షిణబాహువుతో - పట్టుకొనిన - దయా సంపూర్ణుడా - దిక్కు జయము
    ఆదరణయు - దయతో అనుగ్రహించితివి (2)   ||స్తుతి||


5. సిలువనెత్తి శ్రమలు సహించ - సేవకు పిలచిన
    స్నేహ దర్శక వీరయోధ - సంశయ హారక
    శ్రమలునింద ఆకలియైన - నీ స్నేహము నుండి ఎడబాపునా(2)  ॥స్తుతి||


Stutinchedanu - stutinchedanu naa yesuprabhun 

Krutajnyatato - anudinamu - stutinchedanu

1. unnata devudu sarvaadhipatiyu -
    urviparipaalaka unnatam visarjinchi 

    nannu vedakina - uttama snehituni - udayam sandhyaa

    ellappudunu - utsaahadhvanito paadedanu (2)     ||stuti||


2. naashanakaramaina paapa guntanundi -
    naraka vedananundi 

    nannu vidipinchi pilichina deva - nirmala svaroopa 

    neeti samaadhaanam - santoshamuto -
  nityajeevamu naakichchitivi (2)  ॥stuti॥

3. paapamu kshaminchi - rogamu baapi -
    bhayamunu teerchi 

    pavitradaayaka - paavanamoorti -
    parishuddhamichchina 

    paramapaadam - sharanyam naaku -
  parama raaja punyadeva (2)      ||stuti||


4. talligarbhamunaku - munderparachi -
    dehamu namarchiyunu 

    dakshinabaahuvuto - pattukonina -
    dayaa sampoornudaa - dikku jayamu 

    aadaranayu - dayato anugrahinchitivi (2)   ||stuti||


5. siluvanetti shramalu sahincha - sevaku pilachina 

    sneha darshaka veerayodha - sanshaya haaraka 

    shramaluninda aakaliyaina -
    nee snehamu nundi edabaapunaa(2)  ॥stuti||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు