సందేహమేల సంశయ మదేల - ప్రభుయేసు,

సందేహమేల సంశయ మదేల - ప్రభుయేసు గాయములను పరికించి చూడు
గాయాలలో నీ వ్రేలు - తాకించి చూడు       ॥సందే||


1. ఆ ముండ్ల మకుటము నీకై ధరియించెనే - నీ పాప శిక్షను
    యేసు భరియించెనే - ప్రవహించె రక్తధార నీ కోసమే
    కడు ఘోర హింసనొందె నీ కోసమే          ||సందే|


2. లోకాన ఎవ్వరు నీకై మరణించరు - నీ శిక్షలను భరియింప
  సహియింపరు నీ తల్లియైన గాని - నిన్ను మరచునే
  ఆ ప్రేమమూర్తి నిన్ను - మరువజాలునా    ॥సందేll


3. ఎందాక యేసుని నీవు - ఎరుగనందువు ఎందాక హృదయము
    బయట - నిలువమందువు యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా
    యేసయ్య - సిలువ సువార్త చులకనాయెనా   ॥సందేll


4. ఈ లోక భోగములను - వీడ జాలవా - సాతాను బంధకమందు
  సంతసింతువా యేసయ్య సహనముతోడ - చెలగాటమా
  ఈనాడే రక్షణ దినము - గ్రహించుమా         ॥సందేll


Sandehamela sanshaya madela - prabhuyesu gaayamulanu parikinchi choodu 

Gaayaalalo nee vrelu - taakinchi choodu       ॥sande||


1. aa mundla makutamu neekai dhariyinchene - nee paapa shikshanu 

    yesu bhariyinchene - pravahinche raktadhaara nee kosame 

    kadu ghora hinsanonde nee kosame          ||sande|


2. lokaana evvaru neekai maranincharu - nee shikshalanu bhariyimpa 

   sahiyimparu nee talliyaina gaani - ninnu marachune 

   aa premamoorti ninnu - maruvajaalunaa    ॥sandell


3. endaaka yesuni neevu - erugananduvu endaaka hrudayamu 

    bayata - niluvamanduvu yesayya prema neeku lokuvaayenaa 

    yesayya - siluva suvaarta chulakanaayenaa   ॥sandell


4. ee loka bhogamulanu - veeda jaalavaa - saataanu bandhakamandu 

   santasintuvaa yesayya sahanamutoda - chelagaatamaa

   eenaade rakshana dinamu - grahinchumaa         ॥sandell


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు