సర్వమేసువే నాకు సర్వమేసువే సర్వదుఃఖ

సర్వమేసువే నాకు సర్వమేసువే సర్వదుఃఖ పరిహార సర్వమేసువే
జీవమున్ సజీవమున్ సర్వమేసునికి దాయమే
భావశుద్ధి భాగ్యమొసగు భాస్కరుండేసుడే


1. సర్వమేసువే నాకు సర్వమేసువే మాయాలోకమందు మాకు
  మాన్యుడేసుడే మాయాయువు కాలమందు జీవమందు శోధనన్
  నిందబాధలందు విజయమొసగు వంధ్యుడేసుడే      llసర్వll


2. పావనాత్ముడే యేసు పరంధాముడే పావనచరితుండు యేసు
  పతితపావనుడే - పాపము హరించు పరమపావనుండు యేసుడే
  పంచగాయ మొందిన పరమావతారుడేసుడే llసర్వll


3. ఘోర పాపినే నేను ఘోర పాపినే ఘోరపాప నిర్యాణంబు
    లందింపజేసెన్ - పారగా నీ జీవరక్తం గోరి మమ్ము నందరిన్
    పాప పవిత్రుల జేయు ప్రాపు గోరి యుంటిమి       llసర్వll


Sarvamesuve naaku sarvamesuve sarvaduhkha parihaara sarvamesuve 

Jeevamun sajeevamun sarvamesuniki daayame 

Bhaavashuddhi bhaagyamosagu bhaaskarundesude


1. sarvamesuve naaku sarvamesuve maayaalokamandu maaku

   maanyudesude maayaayuvu kaalamandu jeevamandu shodhanan 

  nindabaadhalandu vijayamosagu vandhyudesude      llsarvall


2. paavanaatmude yesu parandhaamude paavanacharitundu yesu 

   patitapaavanude - paapamu harinchu paramapaavanundu yesude 

   panchagaaya mondina paramaavataarudesude llsarvall


3. ghora paapine nenu ghora paapine ghorapaapa niryaanambu 

    landimpajesen - paaragaa nee jeevaraktam gori mammu nandarin 

    paapa pavitrula jeyu praapu gori yuntimi       llsarvall 


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు