యేసుని ప్రేమను - నేమారకను - నెప్పుడు దలచవే
యేసుని ప్రేమను - నేమారకను - నెప్పుడు దలచవే
యో మనసా = వాసిగ నాతని వరనామంబును - వదలక పొగడవె యో మనసా
1. పాపులకొరకై - ప్రాణము బెట్టిన - ప్రభు నిల
దలచవె యో మనసా = శాపము నంతయు
జక్కగ నోర్చిన - శాంతుని పొగడవె యో మనసా ॥యేసుని॥
2. కష్టములలో మన - కండగ నుండిన - కర్తను
దలచవె యో మనసా = నష్టము లన్నియు
నణచిన యాగురు - శ్రేష్ఠుని పొగడవె యో మనసా ॥యేసుని॥
3. మరణతఱిని మన - శరణుగ నుండెడు - మాన్యుని
దలచవె యో మనసా = కరుణను మన క - న్నీటిని
దుడిచిన - కర్తను పొగడవె యో మనసా ॥యేసుని॥
4. ప్రార్ధనలు విని - ఫలముల నొసగిన ప్రభునిక
దలచవె యో మనసా = వర్ధన గోరుచు - శ్రద్ధతో
దిద్దిన - వంద్యుని పొగడవె యో మనసా ॥యేసుని॥
5. వంచనలేక - వరముల నొసగిన వరదుని
దలచవె యో మనసా = కొంచెము కాని - కూర్మితో
దేవుని - కొమరుని పొగడవె యో మనసా ॥యేసుని॥
Yesuni premanu - nemaarakanu - neppudu dalachave
Yo manasaa = vaasiga naatani varanaamambunu - vadalaka pogadave yo manasaa
1. paapulakorakai - praanamu bettina - prabhu nila
dalachave yo manasaa = shaapamu nantayu
jakkaga norchina - shaantuni pogadave yo manasaa ॥yesuni॥
2. kashtamulalo mana - kandaga nundina - kartanu
dalachave yo manasaa = nashtamu lanniyu
nanachina yaaguru - shreshthuni pogadave yo manasaa ॥yesuni॥
3. maranatarini mana - sharanuga nundedu - maanyuni
dalachave yo manasaa = karunanu mana ka - nneetini
dudichina - kartanu pogadave yo manasaa ॥yesuni॥
4. praardhanalu vini - phalamula nosagina prabhunika
dalachave yo manasaa = vardhana goruchu - shraddhato
diddina - vandyuni pogadave yo manasaa ॥yesuni॥
5. vanchanaleka - varamula nosagina varaduni
dalachave yo manasaa = konchemu kaani - koormito
devuni - komaruni pogadave yo manasaa ॥yesuni॥
Comments
Post a Comment