స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ

స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ

నా హృదయ వీణపై శృతిచేసి పాడనా

నా యేసు రాజా అనురాగ బంధమా

నన్ను విడవలేని  ఆత్మ అనుబంధమా… (2)


1. నా ప్రియ నేస్తమా నా ప్రాణ బంధమా

నీ ప్రేమ కౌగిలిలో  నన్ను ఆదరించుమా… (2)

నీ సిలువ త్యాగం నేనెలా మరిచిపోదును

ఇలలోన నీకై సాక్షిగా జీవించును… (2)  ll నా యేసు రాజా ll

2. నా నీతి సూర్యుడా తేజో ప్రకాశమా

నీ వెలుగు జాడలలో నిను వెంబడించిగా… (2)

నీ జీవ వాక్యం నింపినే నాలో ధైర్యము ప్రాణాత్మ దేహం

సర్వదా నీకే అంకితం… (2)               ll నా యేసు రాజా ll

3. మహిమ సింహాసనం నే చేరాలనే

నే కన్న కలలన్నీ నిజమైన వేళలో… (2)

నా జయము నీవై నిలిచినా శ్రేష్ట తరుణాన

నీలోనే లీనమై పోదునే నే నిరంతరము… (2)   ll నా యేసు రాజా ll Stuti keertaneeyudaa ghanamaina nee prema Naa hrudaya veenapai shrutichesi paadanaa Naa yesu raajaa anuraaga bandhamaa Nannu vidavaleni aatma anubandhamaa… (2) 1. naa priya nestamaa naa praana bandhamaa Nee prema kaugililo nannu aadarinchumaa… (2) Nee siluva tyaagam nenelaa marichipodunu Ilalona neekai saakshigaa jeevinchunu… (2) ll naa yesu raajaa ll 2. naa neeti sooryudaa tejo prakaashamaa Nee velugu jaadalalo ninu vembadinchigaa… (2) Nee jeeva vaakyam nimpine naalo dhairyamu praanaatma deham Sarvadaa neeke ankitan… (2) ll naa yesu raajaa ll 3. mahima sinhaasanam ne cheraalane Ne kanna kalalannee nijamaina velalo… (2) Naa jayamu neevai nilichinaa shreshta tarunaana Neelone leenamai podune ne nirantaramu… (2) ll naa yesu raajaa ll


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు