సాక్ష్యమిచ్చెద - మన స్వామి యేసు దేవు డంచు సాక్ష్యమిచ్చెద

సాక్ష్యమిచ్చెద - మన స్వామి యేసు దేవు డంచు సాక్ష్యమిచ్చెద
సాక్ష్య మనగ గనిన వినిన - సంగతులను దెల్పుటయే
సాక్ష్య మిచ్చుకొఱకు నన్ను- స్వామి రక్షించె నంచు


1. దిక్కు దెసయు లేని నన్ను దేవు డెంతో కనికరించి =
    మక్కువతో నాకు నెట్లు - మనశ్శాంతి నిచ్చినాడో     ॥సాక్ష్య॥


2. పల్లెటూళ్ల జనుల రక్షణ భారము నాపైని గలదు - పిల్లలకును
    బెద్దలకును - బ్రేమతో నా స్వానుభవము             ॥సాక్ష్య॥


3. బోధచేయలేను వాద - ములకుఁ బోను నాక దేల= నాధుడేను
    ప్రభుని గూర్చి - నాకు దెలిసినంత వరకు        ॥సాక్ష్య॥


4. పాపులకును మిత్రు డంచు బ్రాణ మొసగి లేచె నంచు =
    బాపముల క్షమించు నంచు ప్రభుని విశ్వసించుడంచు  ॥సాక్ష్య॥


5. చోరులైన జారునా చారులైన నెవ్వరైన = ఘోరపాపు
    లైన క్రీస్తు - కూర్మితో రక్షించు నంచు      ॥సాక్ష్య॥


6. పరమత దూషణము లేల - పరిహసించి పలుకు టేల =
    ఇరుగు పొరుగు వారికెల్ల - యేసుక్రీస్తు దేవుడంచు  ॥సాక్ష్య॥ 


7. ఎల్లకాల మూరకుండ - నేల యాత్మశాంతిలేక = తల్లడిల్లు
    వారలకును - తండ్రి కుమారాత్మ పేర    ॥సాక్ష్య॥


Saakshyamichcheda - mana svaami yesu devu danchu saakshyamichcheda 

Saakshya managa ganina vinina - sangatulanu delputaye 

Saakshya michchukoraku nannu- svaami rakshinche nanchu


1. dikku desayu leni nannu devu dento kanikarinchi = 

    makkuvato naaku netlu - manashshaanti nichchinaado     ॥saakshya॥


2. palletoolla janula rakshana bhaaramu naapaini galadu - pillalakunu 

    beddalakunu - bremato naa svaanubhavamu             ॥saakshya॥


3. bodhacheyalenu vaada - mulakum bonu naaka dela= naadhudenu 

    prabhuni goorchi - naaku delisinanta varaku        ॥saakshya॥


4. paapulakunu mitru danchu braana mosagi leche nanchu = 

    baapamula kshaminchu nanchu prabhuni vishvasinchudanchu  ॥saakshya॥


5. chorulaina jaarunaa chaarulaina nevvaraina = ghorapaapu 

    laina kreestu - koormito rakshinchu nanchu      ॥saakshya॥


6. paramata dooshanamu lela - parihasinchi paluku tela = 

    irugu porugu vaarikella - yesukreestu devudanchu  ॥saakshya॥ 


7. ellakaala moorakunda - nela yaatmashaantileka = talladillu 

    vaaralakunu - tandri kumaaraatma pera    ॥saakshya॥ 

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు