ప్రార్థించుచుంటివా విశ్వాసి - ప్రార్ధన మరువకుమా పరదేశీ

ప్రార్థించుచుంటివా విశ్వాసి - ప్రార్ధన మరువకుమా పరదేశీ


1. ప్రార్ధనే నీ పాప భార మెల్ల తీయునే
    నరుని దాస్య బంధములను త్రుంచి వేసెను
    పరిశుద్ధుని చెంత చేర్చెనే - ప్రాణమునకు సేదదీర్చెనే (2)


2. ప్రార్థనే పరదేశమందు నిన్ను బ్రతికించునే
    ప్రార్థనే ఎడారిలో దాహమీయునే
    ప్రార్థనే నిన్ను నడుపును - ప్రార్ధనే కడకు చేర్చును (2)


3. ప్రార్ధనే పరిశుద్ధ సీమ ప్రేమగీతము
    ప్రార్థనే ప్రార్ధించు యేసునామ సంకీర్తనం
    ప్రార్థనే ప్రభుని కాహ్వానము - ప్రార్ధనే తండ్రి సోపానము (2)


4. ప్రార్థనే పనివాని చేత ప్రేమ పతాకము
    ప్రార్థనే పరలోక రాజ్య విజయ శంఖారావము
    ప్రార్థనే విప్లవ పోరాటము - ప్రార్ధనే పోరాట నియమము (2)


5. ప్రార్థనే పరలోక నిధిని తెరచు తాళము
    ప్రార్థనే ప్రభు నుండి మనము పొందు సూత్రము
    ప్రార్ధనే క్షేమ మందిరము- ప్రార్థనే ప్రేమ ప్రాకారము (2)

Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో