మనసున్న మంచిదేవా - నీ మనసు నాకిచ్చావా

      మనసున్న మంచిదేవా - నీ మనసు నాకిచ్చావా
          మనసు మలినమైన నాకై - మనిషిగా దిగివచ్చావా


అ.ప.  నా మదిని కోవెలగా మలచుకోవయా
        నా హృదిని రారాజుగా నిలిచిపోవయా


1. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము
    దానిని గ్రహియించుట ఎవరి సాధ్యము

    మనసు మర్మమెరిగిన మహనీయుడా - మనసు మార్చగలిగిన నిజదేవుడా


2. చంచల మనస్సాడించు బ్రతుకు ఆటను - వంచన చేసి నడుపును తప్పుబాటను
  అంతరంగమును పరిశీలించు యేసయ్య - స్థిరమనస్సుతో నీ దారిలో సాగనీవయ్యా


3. నిండు మనస్సుతో నిన్ను ఆశ్రయించితి - దీన మనస్సుతో నీకడ శిరము వంచితి
  పూర్ణశాంతి గల వానిగా నన్ను మార్చుమా - తరతరములకు క్షేమము చేకూర్చుమా

Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో