ప్రేమామృత ధారలు చిందిన - మన యేసుకు
1. ప్రేమామృత ధారలు చిందిన - మన యేసుకు - సమమెవరు? ఆ..... ఆ....
ప్రేమయే తానై నిలిచి - ప్రేమోక్తులనే పలికి
ప్రేమతో ప్రాణము బెట్టి - ప్రేమనగరికి చనియె ఆ........ ||ప్రేమా||
2. నిశ్చలమైన ప్రేమజీవికి - ఇలలో తావేది? ఆ....ఆ.....
ప్రేమ ద్రోహులేగాని - ప్రియమున చేరరు వాని
చేరిన చెలికాడగురా - సమయమిదే పరుగిడరా ఆ....ఆ.... ||ప్రేమా||
3. ఎంత ఘోర పాపాత్ములనైన - ప్రేమించును రా రా
పాపభారముతో రారా - పాదములపై బడరా
పాపుల రక్షకుడేసు - తప్పక నిను రక్షించు ఆ..... ఆ... . ||ప్రేమా||
4. ఇంత గొప్ప రక్షణను - నిర్లక్ష్యము చేసేదరేల
రక్షణ దిన మిదియేరా - తక్షణమే కనుగొనురా
ఇదియే దేవుని వరము - ముదమారగ చేకొనుము ఆ... ఆ...||ప్రేమా||
1. premaamruta dhaaralu chindina - mana yesuku - samamevaru? aa..... aa....
premaye taanai nilichi - premoktulane paliki
premato praanamu betti - premanagariki chaniye aa........ ||premaa||
2. nishchalamaina premajeeviki - ilalo taavedi? aa....aa.....
prema drohulegaani - priyamuna cheraru vaani
cherina chelikaadaguraa - samayamide parugidaraa aa....aa.... ||premaa||
3. enta ghora paapaatmulanaina - preminchunu raa raa
paapabhaaramuto raaraa - paadamulapai badaraa
paapula rakshakudesu - tappaka ninu rakshinchu aa..... aa... . ||premaa||
4. inta goppa rakshananu - nirlakshyamu chesedarela
rakshana dina midiyeraa - takshaname kanugonuraa
idiye devuni varamu - mudamaaraga chekonumu aa... aa...||premaa||
Comments
Post a Comment