పరిశుద్దాత్మను గోరుము

పరిశుద్దాత్మను గోరుము - జీవమ యేసు-ప్రభుని పేరట

వేడుము - నరులందరి మీద - నాయాత్మ నుంతునని

పరలోకపు తండ్రి - పలికె వేదమునందు ||పరిశు||


1. పరిశుద్దాత్మ లేనిది - వేదగమ - పఠన పఠనము గాదది
    నెర చీకటింట సర - కులు వెదకు రీతి ప - ల్మరు వెదకినను నిర - ర్దకమై పోవును వేగ ||పరిశు||


2. పరిశుద్దాత్మ లేనిది - వర్షము లేని - పైరు చందంబే యది
    పరబోధక ముల వ - ర్తితమైన పనులు జీ - వ రహితములై యనుభవము గానివై యుండు ||పరిశు||


3. పరిశుద్దాత్మ లేనిది - యేసు ప్రభుని - నెరుగు టెరుగుట
    గాదది = నరరూపుదాల్చిదు - ర్నరుల రక్షణ కొరకు మరణ మొందిన ప్రభుని - కరుణాధికము వడయ ||పరిశు||


4. పరిశుద్దాత్మ లేనిది - జీవము లేని - బ్రతుకే బ్రతుకుగాదది
    దురితేచ్ఛలను గొప్ప- యురులం దగిలి భక్తి -
    తరిగి పోవుట కద్ది - దొరకనందున సుమ్ము llపరిశుll


5. పరిశుద్దాత్మను బొందుట - అన్నిటి కన్న- ప్రబలంబైన మేలిట
    నెర నమ్మి మొఱబెట్టు - పరమ పావన డద్ది - కరుణించి
    నీ కొసగు - మరణాంత మగు దనుక
||పరిశు|| Parishuddaatmanu gorumu - jeevama yesu-prabhuni perata Vedumu - narulandari meeda - naayaatma nuntunani Paralokapu tandri - palike vedamunandu ||parishu|| 1. parishuddaatma lenidi - vedagama - pathana pathanamu gaadadi nera cheekatinta sara - kulu vedaku reeti pa - lmaru vedakinanu nira - rdakamai povunu vega ||parishu|| 2. parishuddaatma lenidi - varshamu leni - pairu chandambe yadi parabodhaka mula va - rtitamaina panulu jee - va rahitamulai yanubhavamu gaanivai yundu ||parishu|| 3. parishuddaatma lenidi - yesu prabhuni - nerugu teruguta gaadadi = nararoopudaalchidu - rnarula rakshana koraku marana mondina prabhuni - karunaadhikamu vadaya ||parishu|| 4. parishuddaatma lenidi - jeevamu leni - bratuke bratukugaadadi duritechchhalanu goppa- yurulam dagili bhakti - tarigi povuta kaddi - dorakananduna summu llparishull 5. parishuddaatmanu bonduta - anniti kanna- prabalambaina melita nera nammi morabettu - parama paavana daddi - karuninchi nee kosagu - maranaanta magu danuka ||parishu||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు