నీ రక్తములో నను కడిగితివి

 నీ రక్తములో నను కడిగితివి పరిశుద్ధుని చేసితివి
      నీ రక్తము నాకై కార్చితివి నీ ప్రాణము నిచ్చితివి

అ.ప     ఏమిత్తునయ్యా - ఏమిత్తునయ్యా నీ ప్రేమకు సాటిగనూ
          నా రక్షణ పాత్రను చేబూని - అర్పింతు కృతజ్ఞతలన్


1. గతవత్సరము - నా శోధనలో - నా నిందలు భారములన్
    తప్పించితివి కాపాడితివి - నను ప్రేమతో నడిపితివి


2. నీ సన్నిధిలో నను జేర్చితివి - నీ ప్రేమను తలపోయన్
    నీ గాయపు నీడలో దాచితివి - నీ మార్గము జూపితివి


3. పలు భయములు బలముగ చుట్టుకొనన్ - నీ వభయము నిచ్చితివి
    నిను విడువను మరి యెడబాయనని - వాగ్దానము నిచ్చితివి nee raktamulo nanu kadigitivi parishuddhuni chesitivi nee raktamu naakai kaarchitivi nee praanamu nichchitivi A.pa emittunayyaa - emittunayyaa nee premaku saatiganoo naa rakshana paatranu chebooni - arpintu krutajnyatalan 1. gatavatsaramu - naa shodhanalo - naa nindalu bhaaramulan tappinchitivi kaapaaditivi - nanu premato nadipitivi 2. nee sannidhilo nanu jerchitivi - nee premanu talapoyan nee gaayapu needalo daachitivi - nee maargamu joopitivi 3. palu bhayamulu balamuga chuttukonan - nee vabhayamu nichchitivi ninu viduvanu mari yedabaayanani - vaagdaanamu nichchitivi

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు