మన దేవుని పట్టణ మందాయన పరిశుద్ధ పర్వతమందు

మన దేవుని పట్టణ మందాయన పరిశుద్ధ పర్వతమందు
యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడైయున్నాడు


1. ఉత్తర దిక్కున మహరాజు పట్టణమైన సీయోను పర్వతము
    ఉన్నతమై అందముగా సర్వభూమికి సంతోషమిచ్చుచున్నది   llమనll


2. దాని నగరులలో దేవుడా శ్రయముగా ప్రత్యక్షంబగుచున్నాడు
    రాజు లేకముగా కూడి ఆశ్చర్యపడి భ్రమపడి త్వరగా వెళ్ళిరి    llమనll   


3. అచ్చట వారల వణకును ప్రసవించు స్త్రీ వేదన పట్టెను
    తూర్పు గాలిని రేపి తర్షీషు ఓడల పగుల గొట్టుచున్నావు    llమనll


4. సైన్యముల కధిపతి యెహోవా దేవుని పట్టణము నందు
    మనము వినినట్టి రీతిగ జరుగుట మనము చూచితిమి   llమనll


5. మన దేవుడు నిత్యముగా దానిని సిద్ధపరచియున్నాడు
    దేవా నీ ఆలయమందును నీ కృపను ధ్యానించితిమి   llమనll Mana devuni pattana mandaayana parishuddha parvatamandu Yehovaa goppavaadunu bahu keertaneeyudaiyunnaadu 1. uttara dikkuna maharaaju pattanamaina seeyonu parvatamu unnatamai andamugaa sarvabhoomiki santoshamichchuchunnadi llmanall 2. daani nagarulalo devudaa shrayamugaa pratyakshambaguchunnaadu raaju lekamugaa koodi aashcharyapadi bhramapadi tvaragaa velliri llmanall 3. achchata vaarala vanakunu prasavinchu stree vedana pattenu toorpu gaalini repi tarsheeshu odala pagula gottuchunnaavu llmanall 4. sainyamula kadhipati yehovaa devuni pattanamu nandu manamu vininatti reetiga jaruguta manamu choochitimi llmanall 5. mana devudu nityamugaa daanini siddhaparachiyunnaadu devaa nee aalayamandunu nee krupanu dhyaaninchitimi llmanall

Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో