యేసన్న స్వరమన్నా - నీవెపుడైన విన్నావా
యేసన్న స్వరమన్నా - నీవెపుడైన విన్నావా
1. జలముల శబ్దము జనముల శబ్దము- బలమైన ఉరుములతో కలసిన
స్వరముపిలచిన యేసు - పిలచిన పిలుపును నీవింటివా ॥యేస॥
2. ఏదేను తోటలో ఆదాముచెడగా - ఆ దేవుడే పిలచే దేవుని
ఎదుటను ఆదాము దాగిన అటులానే నీవు దాగేదవా
3. పనులను వదలి జనులను విడచి - నను కనుగొనుమనగా కనిపెట్టి
నందున ఘనుడబ్రహామునకు - కనిపించే మనకన్నతండ్రి యేసే ॥యేస॥
4. ఆనాడు దేవుడు - మోషేనుపిలువగ - ఆలకించెను స్వరము ఈనాడు
నీవును ఈ స్వరము వినగా - కానానుచేరగ కదలి రావా ॥యేస॥
5. ఆ రీతిగానే సమూయేలు వినగా - ఆశీర్వాద మరసె
ధారాళముగను - పరమవరుని - దరిజేరుకొని నీవు సేవించుమా ॥యేస॥
6. సౌల! సౌల! నన్నేల హింసింతువు - చాలించుమనె స్వరము
సౌలాధిపునినంత సంధించగానే - సద్భక్తుడై పౌలుగా మారెను ॥యేస॥
7. స్వరమును వినగా-పరమార్ధజ్ఞాని - స్థిరుడైన యోహాను పరమామర్మాలు
భవిషద్విషయాలు - ప్రకటించె ప్రతిరోజు స్మరియించుమా ॥యేస॥
Yesanna svaramannaa - neevepudaina vinnaavaa
1. jalamula shabdamu janamula shabdamu- balamaina urumulato kalasina
svaramupilachina yesu - pilachina pilupunu neevintivaa ॥yesa॥
2. edenu totalo aadaamuchedagaa - aa devude pilache devuni
edutanu aadaamu daagina atulaane neevu daagedavaa
3. panulanu vadali janulanu vidachi - nanu kanugonumanagaa kanipetti
nanduna ghanudabrahaamunaku - kanipinche manakannatandri yese ॥yesa॥
4. aanaadu devudu - moshenupiluvaga - aalakinchenu svaramu eenaadu
neevunu ee svaramu vinagaa - kaanaanucheraga kadali raavaa ॥yesa॥
5. aa reetigaane samooyelu vinagaa - aasheervaada marase
dhaaraalamuganu - paramavaruni - darijerukoni neevu sevinchumaa ॥yesa॥
6. saula! saula! nannela hinsintuvu - chaalinchumane svaramu
saulaadhipuninanta sandhinchagaane - sadbhaktudai paulugaa maarenu ॥yesa॥
7. svaramunu vinagaa-paramaardhajnyaani - sthirudaina yohaanu paramaamarmaalu
bhavishadvishayaalu - prakatinche pratiroju smariyinchumaa ॥yesa॥
Comments
Post a Comment