నీ ధనము - నీ ఘనము
నీ ధనము - నీ ఘనము - ప్రభు యేసుదే
నీ దశమభాగము నీయ - వెనుదీతువా
1. ధరలోన ధనధాన్యముల నీయగా - కరుణించి కాపాడి రక్షింపగా
పరలోక నాధుండు నీకీయగా - మరి యేసు కొరకీయ వెనుదీతువా llనీ ధనముll
2. పాడిపంటలు ప్రభువు నీకీయగా - కూడు గుడ్డలు నీకు దయచేయగా
వేడంగా ప్రభు యేసు నామంబును - గడువేల ప్రభు కీయనో క్రైస్తవా llనీ ధనముll
3. వెలుగు నీడలు గాలి వర్షంబులు - కలిగించె ప్రభు నీకు ఉచితంబుగా
వెలిగించ ధరపైని ప్రభు నామము - కలిమి కొలది ప్రభున కర్పింపవా llనీ ధనముll
4. కలిగించె సకలంబు సమృద్ధిగా - తొలగించె పలు బాధ భరితంబులు
బలియాయె నీ పాపముల కేసువే - చెలువంగ ప్రభు కీయ చింతింతువా llనీ ధనముll
nee dhanamu - nee ghanamu - prabhu yesude
nee dashamabhaagamu neeya - venudeetuvaa
1. dharalona dhanadhaanyamula neeyagaa -
karuninchi kaapaadi rakshimpagaa
paraloka naadhundu neekeeyagaa -
mari yesu korakeeya venudeetuvaa llnee dhanamull
2. paadipantalu prabhuvu neekeeyagaa -
koodu guddalu neeku dayacheyagaa
vedangaa prabhu yesu naamambunu -
gaduvela prabhu keeyano kraistavaa llnee dhanamull
3. velugu needalu gaali varshambulu -
kaliginche prabhu neeku uchitambugaa
veligincha dharapaini prabhu naamamu -
kalimi koladi prabhuna karpimpavaa llnee dhanamull
4. kaliginche sakalambu samruddhigaa -
tolaginche palu baadha bharitambulu
baliyaaye nee paapamula kesuve -
cheluvanga prabhu keeya chintintuvaa llnee dhanamull
Comments
Post a Comment