మా దేవ మా దేవ నీదు - విశ్వాస్యత చాలా గొప్పది
మా దేవ మా దేవ నీదు - విశ్వాస్యత చాలా గొప్పది
1. దయామయుండగు తండ్రివి నీవే - తల్లిని మించిన దాతవు నీవే
మాయా మమతల గాధలనుండి - మంచిగ మమ్ము రక్షించితివి ॥మా దేవ||
2. కోడిపిల్లలను కాచెడి పగిది - ఆపదలన్నిటి బాపతివయ్యా
సర్వకాలముల యందున నీకే - చక్కగా సంస్తుతులగు నీకే ॥మా దేవ॥
3. సింహపు పిల్లలు ఆకలిగొనిన - సింహపు బోనులో ననువేసినను
సిగ్గు కలుగకుండగ నను నీవు - కాపాడుచున్నావు ఇలలో ॥మా దేవ||
4. మరణ లోయలందున నేనున్న- తరుణములు నాకు విరోధమైన
చరణముల్ పాడెడు విధమున నీవు - నన్నోదార్చుచున్నావుగా ॥మా దేవ॥
5. వ్యాధులు నన్ను బాధించినను - వ్యాకులములు హృదయములో నున్న
వదలవు నన్నిల అనాధునిగ-నెప్పుడు నను బ్రోచుచునుందువుగా ॥మా దేవ॥
6. నీదు సత్యమాకాశముకంటె - అత్యున్నతముగ స్థాపించబడె
నీదు సత్యమును నీచుడనగు నా - కనులకు ప్రత్యక్షపరచితివి ॥మా దేవ॥
7. పర్వతంబులు తొలగిన గాని - పలువిధ కొండలు తత్తరిల్లినను
పావనుడా నీదు వెలలేనియట్టి కృప - నన్ను విడువదు హల్లెలూయ॥మా దేవ॥
maa deva maa deva needu - vishvaasyata chaalaa goppadi
1. dayaamayundagu tandrivi neeve - tallini minchina daatavu neeve
maayaa mamatala gaadhalanundi - manchiga mammu rakshinchitivi ॥maa deva||
2. kodipillalanu kaachedi pagidi - aapadalanniti baapativayyaa
sarvakaalamula yanduna neeke - chakkagaa sanstutulagu neeke ॥maa deva॥
3. sinhapu pillalu aakaligonina - sinhapu bonulo nanuvesinanu
siggu kalugakundaga nanu neevu - kaapaaduchunnaavu ilalo ॥maa deva||
4. marana loyalanduna nenunna- tarunamulu naaku virodhamaina
charanamul paadedu vidhamuna neevu - nannodaarchuchunnaavugaa ॥maa deva॥
5. vyaadhulu nannu baadhinchinanu - vyaakulamulu hrudayamulo nunna
vadalavu nannila anaadhuniga-neppudu nanu brochuchununduvugaa ॥maa deva॥
6. needu satyamaakaashamukante - atyunnatamuga sthaapinchabade
needu satyamunu neechudanagu naa - kanulaku pratyakshaparachitivi ॥maa deva॥
7. parvatambulu tolagina gaani - paluvidha kondalu tattarillinanu
paavanudaa needu velaleniyatti krupa - nannu viduvadu hallelooya॥maa deva॥
Comments
Post a Comment