నా ప్రియ యేసునిపై ఆనుకొని

నా ప్రియ యేసునిపై ఆనుకొని

అరణ్య మార్గమున నడచుటయే ఆనంద జీవితము llనా ప్రియll


1. లిల్లి పుష్పం షారోను రోజ - పరిశుద్ధమైన మాదు తండ్రి
    పూర్ణ రూప సౌందర్యుడే - కీర్తింప తగిన దేవా           llనా ప్రియll


2. పరిశుద్ధులు ప్రేమించు దేవా - నా ప్రభు నామము పరిమళమే
  యేసుని వెనుక వచ్చితిమి - నన్ను ఆకర్షించెను ॥నా ప్రియ॥


3. ప్రేమ ధ్వజ మెగురుచుండగా - ప్రియుని సముఖము
  కలుగుటచే జల్దరు వృక్షము క్రింద కలిగెన్ - ప్రభుని ఆదరణ ॥నా ప్రియ॥


4. నిద్రించు రాత్రి సమయమునందు - నిత్యం నా ఆత్మ
  మేలుకొని నా తలుపునొద్ద నిలిచిన - యేసుని ప్రేమించెదన్     ॥నా ప్రియ॥


5. అగ్నిజ్వాల యేసుని ప్రేమ - మరణమువలె బలవంతమైనది
    నీటి ప్రవాహముల వలన ఆ ప్రేమ చల్లారదు         ॥నా ప్రియ॥


6. ధూపస్థంభంవలె దిగి వచ్చును - దేవకుమారుడు మహిమతో
    ఘనులైనవారి రథమువలె - పై కెగిరిపోదును      ॥నా ప్రియ॥ naa priya yesunipai aanukoni aranya maargamuna nadachutaye aananda jeevitamu llnaa priyall 1. lilli pushpam shaaronu roja - parishuddhamaina maadu tandri poorna roopa saundaryude - keertimpa tagina devaa llnaa priyall 2. parishuddhulu preminchu devaa - naa prabhu naamamu parimalame yesuni venuka vachchitimi - nannu aakarshinchenu ॥naa priya॥ 3. prema dhvaja meguruchundagaa - priyuni samukhamu kalugutache jaldaru vrukshamu krinda kaligen - prabhuni aadarana ॥naa priya॥ 4. nidrinchu raatri samayamunandu - nityam naa aatma melukoni naa talupunodda nilichina - yesuni preminchedan ॥naa priya॥ 5. agnijvaala yesuni prema - maranamuvale balavantamainadi neeti pravaahamula valana aa prema challaaradu ॥naa priya॥ 6. dhoopasthambhanvale digi vachchunu - devakumaarudu mahimato ghanulainavaari rathamuvale - pai kegiripodunu ॥naa priya॥

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు