నేనును నా యింటివారును

   నేనును నా యింటివారును - నీతి సూర్యుని గొలుతుము
    దీనమనసును గలిగి దేవుని - దివ్యసేవను జేతుము


1. అనుదినంబును ప్రభుని దలచుచు - అలయకను ప్రార్ధింతుము
    అనవరత మాప్రభుని చిత్తము - ననుకరింతుము పనులలో ||నేను||


2. వేదవాక్య పఠనమందు - విసుగు జెందకనుందుము
    ఆదరంబున దైవచిత్తము ననుసరించుచు నడుతుము ||నేను||


3. ఆశతోడను ప్రభుని దినమును - నాచరింతుము మరువక
    విసుకు జెందకనాలయమునకు - పిన్న పెద్దల దెత్తుము ||నేను॥


4. సంఘ కార్యక్రమములందు - సహకరింతుము ప్రీతితో
    భంగపరచెడి పనులనన్నిటి కృంగ దీసెదమనిశము ||నేను||


5. ప్రేమతోడను పొరుగువారిని - ప్రియులుగను భావింతుము
    క్షమయు స్నేహమునే నేర్చి ప్రభుకడ-శాంతితో జీవింతుము ||నేను||


6. శక్తికొలది శరీరబలమును - శ్రమను క్రీస్తుకు నిత్తుము
    భక్తితో హృదయమును పూర్తిగ ప్రభునికే యర్పింతుము ||నేను||


7. చిన్నవారలు దైవరాజ్యపు - చిరుత వారసులంచును
    అన్నివేళల వారి వృద్ధికి - మిన్నగ దోడ్పడెదము ||నేను||


8. పెద్దవారలు దైవజనులని - పేర్మితో భావింతుము
    శుద్ధుడగు ప్రభు క్రీస్తు మనసును - శ్రద్ధతోడను జూపుచు ||నేను॥


9. జీవితంబున ప్రభుని ప్రేమా - శ్శీసులను ప్రచురింతుము
    దివ్యజ్యోతుల రీతి వెలుగుచు - దివ్యసన్నిధి నుందుము
||నేను|| nenunu naa yintivaarunu - neeti sooryuni golutumu deenamanasunu galigi devuni - divyasevanu jetumu 1. anudinambunu prabhuni dalachuchu - alayakanu praardhintumu anavarata maaprabhuni chittamu - nanukarintumu panulalo ||nenu|| 2. vedavaakya pathanamandu - visugu jendakanundumu aadarambuna daivachittamu nanusarinchuchu nadutumu ||nenu|| 3. aashatodanu prabhuni dinamunu - naacharintumu maruvaka visuku jendakanaalayamunaku - pinna peddala dettumu ||nenu॥ 4. sangha kaaryakramamulandu - sahakarintumu preetito bhangaparachedi panulananniti krunga deesedamanishamu ||nenu|| 5. prematodanu poruguvaarini - priyuluganu bhaavintumu kshamayu snehamune nerchi prabhukada-shaantito jeevintumu ||nenu|| 6. shaktikoladi shareerabalamunu - shramanu kreestuku nittumu bhaktito hrudayamunu poortiga prabhunike yarpintumu ||nenu|| 7. chinnavaaralu daivaraajyapu - chiruta vaarasulanchunu annivelala vaari vruddhiki - minnaga dodpadedamu ||nenu|| 8. peddavaaralu daivajanulani - permito bhaavintumu shuddhudagu prabhu kreestu manasunu - shraddhatodanu joopuchu ||nenu॥

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు