యేసయ్య నామం - ప్రీతిగల నామం
యేసయ్య నామం - ప్రీతిగల నామం
సాటిలేని నామం - మధుర నామం ॥మన యేసయ్య॥
1. పాపము పోవును - భయమును పోవును
పరమ సంతోషము - భక్తుల కీయును ||యేసయ్య॥
2. పరిమళ తైలము - యేసయ్య నామము
భువిలో సువాసన - వీచెడి నామము ||యేసయ్య॥
3. భూలోకమంతట - మేలైన నామము
సైన్యాధిపతియగు - యేసయ్య నామము ||యేసయ్య||
4. నిన్న నేడు - మారని నామము
నమ్మినవారిని - విడువని నామము ||యేసయ్య॥
5. ప్రతివాని మోకాలు - వంగెడి నామము
ప్రతివాని నాలుక - స్తుతించెడి నామము ||యేసయ్య॥
6. సాతాను సేనను - జయించిన నామము
పాప పిశాచిని - తరిమెడి నామము ||యేసయ్య||
7. భక్తుల కాచెడి - శక్తిగల నామము
పరమున చేర్చెడి - పరిశుద్ధ నామము ॥యేసయ్య||
8. మధురం మధురం - యేసయ్య నామం
మరణము బాపిన - సజీవ నామం ||యేసయ్య||
Yesayya naamam - preetigala naamam
Saatileni naamam - madhura naamam ॥mana yesayya॥
1. paapamu povunu - bhayamunu povunu
parama santoshamu - bhaktula keeyunu ||yesayya॥
2. parimala tailamu - yesayya naamamu
bhuvilo suvaasana - veechedi naamamu ||yesayya॥
3. bhoolokamantata - melaina naamamu
sainyaadhipatiyagu - yesayya naamamu ||yesayya||
4. ninna nedu - maarani naamamu
namminavaarini - viduvani naamamu ||yesayya॥
5. prativaani mokaalu - vangedi naamamu
prativaani naaluka - stutinchedi naamamu ||yesayya॥
6. saataanu senanu - jayinchina naamamu
paapa pishaachini - tarimedi naamamu ||yesayya||
7. bhaktula kaachedi - shaktigala naamamu
paramuna cherchedi - parishuddha naamamu ॥yesayya||
8. madhuram madhuram - yesayya naamam
maranamu baapina - sajeeva naamam ||yesayya||
Comments
Post a Comment