నన్ను దిద్దుము చిన్న ప్రాయము

నన్ను దిద్దుము చిన్న ప్రాయము - సన్నుతుండగు నాయనా =
నీవు - కన్న తండ్రి వనుచు నేను - నిన్ను జేరితి నాయనా  ॥నన్ను॥ 


1. దూరమునకుబోయి నీ దరి జేర నైతిని నాయనా =
నేను కారు  మూర్ఖపు పిల్లనై కా రడవి దిరిగితి నాయానా ॥నన్ను॥


2. మంచి మార్గము లేదు నాలో - మరణ పాత్రండ నాయనా=
నేను వంచితుండ  నైతిని ప్ర-పంచమందున నాయనా ॥నన్ను॥


3. చాల మారులు తప్పిపోతిని మేలు గానక నాయనా=
నా చాల మొఱల  నాలకించుము జాలిగల నా నాయనా ॥నన్ను॥


4. జ్ఞాన మంతయు బాడుచేసి కాన నైతిని నాయనా నీవు =
జ్ఞానము గల  తండ్రి వంచు జ్ఞప్తి వచ్చెను నాయన   ॥నన్ను॥


5. కొద్ది నరుడను దిద్ది నను నీ యొద్ద జేర్చుము నాయనా=
నా యొద్ద  జేరి బుద్ధి చెప్పుము - మొద్దు నైతిని నాయానా   ॥నన్ను॥


6. ఎక్కడను నీవంటి మార్గము - నెఱుగ నైతిని నాయానా =
నీ - టెక్క చాటున నన్ను జేర్చి - చక్కపరచుము నాయనా    ॥నన్ను॥


7. శత్రువగు సాతాను నన్ను - మిత్రు జేయను నాయనా =
యెన్నో సూత్రములు  గల్పించెను నా నేత్రముల కో నాయనా. ॥నన్ను॥


8. వాసిగా నే బాపలోకపు వాసుడ నో నాయనా =
నీ దాసులలో  నొకనిగా నను జేసి కావుము నాయనా           ॥నన్ను॥ Nannu diddumu chinna praayamu - sannutundagu naayanaa = Neevu - kanna tandri vanuchu nenu - ninnu jeriti naayanaa ॥nannu॥ 1. dooramunakuboyi nee dari jera naitini naayanaa = Nenu kaaru moorkhapu pillanai kaa radavi dirigiti naayaanaa ॥nannu॥ 2. manchi maargamu ledu naalo - marana paatranda naayanaa= Nenu vanchitunda naitini pra-panchamanduna naayanaa ॥nannu॥ 3. chaala maarulu tappipotini melu gaanaka naayanaa= Naa chaala morala naalakinchumu jaaligala naa naayanaa ॥nannu॥ 4. jnyaana mantayu baaduchesi kaana naitini naayanaa neevu = jnyaanamu gala tandri vanchu jnyapti vachchenu naayana ॥nannu॥ 5. koddi narudanu diddi nanu nee yodda jerchumu naayanaa= Naa yodda jeri buddhi cheppumu - moddu naitini naayaanaa ॥nannu॥ 6. ekkadanu neevanti maargamu - neruga naitini naayaanaa = Nee - tekka chaatuna nannu jerchi - chakkaparachumu naayanaa ॥nannu॥ 7. shatruvagu saataanu nannu - mitru jeyanu naayanaa = Yenno sootramulu galpinchenu naa netramula ko naayanaa. ॥nannu॥ 8. vaasigaa ne baapalokapu vaasuda no naayanaa = Nee daasulalo nokanigaa nanu jesi kaavumu naayanaa ॥nannu॥


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు