నాకెన్నో మేలులు చేసితివే - నీకేమి అర్పింతును
నాకెన్నో మేలులు చేసితివే - నీకేమి అర్పింతును - దేవా నీకేమి చెల్లింతును
హల్లెలూయా యేసునాథా - కృతజ్ఞతా స్తుతులు నీకే (2)
1. కృపచేత నన్ను రక్షించినావే - కృప వెంబడి కృపతో నను
బలపరచితివే - నన్నెంతగానో ప్రేమించినావే
నా పాపమును కడిగి - పరిశుద్ధ పరచితివే (2) llనాకెన్నోll
2. నాకిక ఆశలు లేవనుకొనగా నా ఆశ నీవైతివే
ఆశలు తీర్చితివే - నలుదిశల నన్ను భయమావరింప
నా పక్షమందుంటివే నాకభయమిచ్చితివే (2) llనాకెన్నోll
3. నీ రాజ్యమందు నను చేర్చుకొందువు - రానున్న రారాజువు
నా రాజువు నీవు - నీ వధువు సంఘమున నను చేర్చుకొన్నావు.
ననుకొన్నవాడవు నా వరుడవు నీవు (2) llనాకెన్నోll
naakenno melulu chesitive - neekemi arpintunu -
devaa neekemi chellintunu
Hallelooyaa yesunaathaa -
krutajnyataa stutulu neeke (2)
1. krupacheta nannu rakshinchinaave -
krupa vembadi krupato nanu
balaparachitive -
nannentagaano preminchinaave
naa paapamunu kadigi -
parishuddha parachitive (2) llnaakennoll
2. naakika aashalu levanukonagaa
naa aasha neevaitive
aashalu teerchitive -
naludishala nannu bhayamaavarimpa
naa pakshamanduntive
naakabhayamichchitive (2) llnaakennoll
3. nee raajyamandu nanu cherchukonduvu -
raanunna raaraajuvu
naa raajuvu neevu -
nee vadhuvu sanghamuna nanu cherchukonnaavu.
nanukonnavaadavu
naa varudavu neevu (2) llnaakennoll
Comments
Post a Comment