ప్రభువు నీ మది కోరెనే - ఈ నేలపై

ప్రభువు నీ మది కోరెనే - ఈ నేలపై దివ్యమైన కాంతిలో ప్రతి రోజున


1. మారునే నీ జీవితం - ఇల శక్తిగల్గిన క్రీస్తులో
    పాపినైన నిన్ను జూచి - నీ మదంతా మార్చునే
    కరము జాచిన క్రీస్తు నిను సంధించునే ॥దివ్యమై॥


2. తీరునే - నీ ఆశలు - కల గాంచుటేల వేరుగా
    భారమైన చెంతజేరిన - భావియంతా మార్చునే
    శరణు గోరిన పాపి నిను సంధించునే ॥దివ్యమై॥

3. సిలువలో రక్తంబు కార్చె - యేసునాధుడు పాపికై

      అందు మునిగిన శుద్ధుడగును - ఎట్టి పాపియైనను
      క్షమను కోరిన పాపి - నిను సంధించునే ॥దివ్యమై॥


4. ఇచ్చును ఆత్మాభిషేకము - పరమ పావనుడేసుడు
    ఇచ్చెను ఆత్మాభిషేకము - ఆది అపొస్తులులకు
    అడుగుము నీకిచ్చి నిను సంధించునే ॥దివ్యమై॥


5. శుద్ధిచేసిన పాపి నతిపరిశుద్ధు - నిగ చేయును
    మహిమ వస్త్రము నిచ్చును - నిను మహిమలోన చేర్చును
    పెండ్లి కుమార్తెగ - నిను సంధించునే ॥దివ్యమై॥


6. పరమసన్నిధి నిచ్చును నీకు పరమ దేవుడేసుడు
    ప్రత్యక్షతలతో నింపును నిను నీ రూపమున క్రీస్తుడు
    నెననరు లేక వేడిన ప్రభు సంధించునే ॥దివ్యమై॥


7. నూతనెరుషాలేమునందు - నిత్యము నిను నిల్పును
  నూతన నామంబు నిచ్చి రాజుగ నిను చేయును
  ఆసనంబు విచ్చినను సంధించునే ॥దివ్యమై॥


8. జాప్యమేల చేతువు, నిను - వేయి సంవత్సరంబులు
    పాపశూన్య రాజ్యమందు - పాలనంబుచేసెనే
    భాగ్యవంతునిగ చేసి నిను సంధించునే ॥దివ్యమై॥


9. క్రొత్త ఆకాశంబు మరియు - క్రొత్త భూమిని చేయును
    యేసుతోడ వధువు సంఘము - నిత్యము నివసించును
    మహిమ మహిమ మహిమ యనుచు - నుందుము
    దివ్యమైన కాంతిలో నెల్లప్పుడు
॥దివ్యమై॥ Prabhuvu nee madi korene - ee nelapai divyamaina kaantilo prati rojuna 1. maarune nee jeevitam - ila shaktigalgina kreestulo paapinaina ninnu joochi - nee madantaa maarchune karamu jaachina kreestu ninu sandhinchune ॥divyamai॥ 2. teerune - nee aashalu - kala gaanchutela verugaa bhaaramaina chentajerina - bhaaviyantaa maarchune sharanu gorina paapi ninu sandhinchune ॥divyamai॥ 3. siluvalo raktambu kaarche - yesunaadhudu paapikai andu munigina shuddhudagunu - etti paapiyainanu kshamanu korina paapi - ninu sandhinchune ॥divyamai॥ 4. ichchunu aatmaabhishekamu - parama paavanudesudu ichchenu aatmaabhishekamu - aadi apostululaku adugumu neekichchi ninu sandhinchune ॥divyamai॥ 5. shuddhichesina paapi natiparishuddhu - niga cheyunu mahima vastramu nichchunu - ninu mahimalona cherchunu pendli kumaartega - ninu sandhinchune ॥divyamai॥ 6. paramasannidhi nichchunu neeku parama devudesudu pratyakshatalato nimpunu ninu nee roopamuna kreestudu nenanaru leka vedina prabhu sandhinchune ॥divyamai॥ 7. nootanerushaalemunandu - nityamu ninu nilpunu nootana naamambu nichchi raajuga ninu cheyunu aasanambu vichchinanu sandhinchune ॥divyamai॥ 8. jaapyamela chetuvu, ninu - veyi sanvatsarambulu paapashoonya raajyamandu - paalanambuchesene bhaagyavantuniga chesi ninu sandhinchune ॥divyamai॥ 9. krotta aakaashambu mariyu - krotta bhoomini cheyunu yesutoda vadhuvu sanghamu - nityamu nivasinchunu mahima mahima mahima yanuchu - nundumu divyamaina kaantilo nellappudu ॥divyamai॥

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు