మహాఘనుడా మహోన్నతా నీ నామము
మహాఘనుడా మహోన్నతా నీ నామము ఎంతో ప్రియము
మా యేసయ్యా మా మంచి దేవా నీ నామము కొనియాడెదము ॥మహా॥
1. ఎన్నెన్నో మారులు చంచలుడనై - నీ మార్గం తప్పి నే తిరిగినను
ఎన్నడైనను నన్ను విడువక - ఎడబాయని కృప చూపి ప్రేమించితివే
అందుకే అందుకే నీ ప్రేమను తలపోసి కీర్తించెదను
అందుకే అందుకే నీ ప్రేమకై ఇల జీవించెదను ॥మహాll
2. పాపినని నన్ను దండించక - నీచుడనని నన్ను నిందించక
దోషుండనని నన్ను దూరపరచక - చేరదీసి నన్ను ప్రేమించితివే
అందుకే అందుకే నీ కొరకే నేను జీవించెదను
అందుకే అందుకే నీ మార్గములందు నే నడచెదను ॥మహాll
Comments
Post a Comment