మహాత్ముడైన నా ప్రభు విచిత్ర సిల్వ జూడ
1. మహాత్ముడైన నా ప్రభు విచిత్ర సిల్వ జూడ నా
యాస్తిన్ నష్టంబుగా నెంచి గర్వం బణంగ ద్రొక్కుదున్
2. నీ సిల్వగాక యో దేవా దేనిన్ బ్రేమింపనీయకు
నన్నాహరించు సర్వమున్ నీ సిల్వకై త్యజింతును
3. శిరంబు పాద హస్తముల్ సూచించు దుఃఖ ప్రేమలు
మరెన్నడైన గూడెనా విషాద ప్రేమ లీగతిన్ !
4. ముండ్లన్ దుర్మార్గులల్లిన కిరీటమేసు కుండినన్
ఈ భూకిరీటములన్నీ దానం దూగంగ జాలునే !
5. లోకంబునే నర్పించిన నయోగ్యమైన యీవియౌ
వింతైన యేసు ప్రేమకై నా యావజ్జీవ మిత్తును
6. రక్షింపబడ్డ లోకమా రక్షింప జావు పొందిన
రక్షకుండేసునిన్ సదా రావంబుతోడ గొల్వుమా
Comments
Post a Comment