నడిపించు నా నావ
నడిపించు నా నావ - నడిసంద్రమున దేవా
నవజీవన మార్గమున - నా జన్మ తరియింప
1. నా జీవిత తీరమున - - నా యపజయ భారమున
నలిగిన నా హృదయమును - నడిపించుము లోతునకు
నా యాత్మ విరబూయ - నా దీక్ష ఫలియింప
నా నావలో కాలిడుము - నా సేవ జేకొనుము llనడిపించుll
2. రాత్రంతయు శ్రమపడినా - రాలేదు ప్రభూ జయము
రహదారులు వెదకినను - రాదాయెను ప్రతిఫలము
రక్షించు నీ సిలువ - రమణీయ లోతులలో
రతనాలను వెదకుటలో - రాజిల్లు నా పడవ llనడిపించుll
3. ఆత్మార్పణ జేయకయే - ఆశించితి నీ చెలిమి
అహమును ప్రేమించుచునే - అరసితి ప్రభు నీ కలిమి
ఆశ నిరాశయె - ఆవేద నెదురాయె
ఆధ్యాత్మిక లేమిగని - అల్లాడె నా వలలు llనడిపించుll
4. ప్రభు మార్గము విడచితిని - ప్రార్థించుట మానితిని
ప్రభు వాక్యము వదలితిని - పరమార్ధము మరచితిని
ప్రపంచ నటనలలో - ప్రావీణ్యమును బొంది
ఫలహీనుడనై యిపుడు - పాటింతు నీ మాట llనడిపించుll
5. లోతైన జలములలో - లోతున వినబడు స్వరమా
లోబడుటను నేర్పించి - లోపంబులు సవరించి
లోనున్న - యీవులలో లోటైన నా బ్రతుకు
లోపించని యర్పణగా - లోకేశ జేయుమయ llనడిపించుll
6. ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని
ప్రకటింతును లోకములో - పరిశుద్ధుని ప్రేమకథ
పరమాత్మ ప్రోక్షణతో - పరిపూర్ణ సమర్పణతో
ప్రాణంబును ప్రభుకొరకు - పానార్పణము జేతు llనడిపించుll
nadipinchu naa naava - nadisandramuna devaa
navajeevana maargamuna - naa janma tariyimpa
1. naa jeevita teeramuna - - naa yapajaya bhaaramuna
naligina naa hrudayamunu - nadipinchumu lotunaku
naa yaatma virabooya - naa deeksha phaliyimpa
naa naavalo kaalidumu - naa seva jekonumu llnadipinchull
2. raatrantayu shramapadinaa - raaledu prabhoo jayamu
rahadaarulu vedakinanu - raadaayenu pratiphalamu
rakshinchu nee siluva - ramaneeya lotulalo
ratanaalanu vedakutalo - raajillu naa padava llnadipinchull
3. aatmaarpana jeyakaye - aashinchiti nee chelimi
ahamunu preminchuchune - arasiti prabhu nee kalimi
aasha niraashaye - aaveda neduraaye
aadhyaatmika lemigani - allaade naa valalu llnadipinchull
4. prabhu maargamu vidachitini - praarthinchuta maanitini
prabhu vaakyamu vadalitini - paramaardhamu marachitini
prapancha natanalalo - praaveenyamunu bondi
phalaheenudanai yipudu - paatintu nee maata llnadipinchull
5. lotaina jalamulalo - lotuna vinabadu svaramaa
lobadutanu nerpinchi - lopambulu savarinchi
lonunna - yeevulalo lotaina naa bratuku
lopinchani yarpanagaa - lokesha jeyumaya llnadipinchull
6. prabhu yesuni shishyudanai prabhu premalo paadukoni
prakatintunu lokamulo - parishuddhuni premakatha
paramaatma prokshanato - paripoorna samarpanato
praanambunu prabhukoraku - paanaarpanamu jetu llnadipinchull
Comments
Post a Comment