నూతన ఆకాశము - నూతన భూమియు
1. నూతన ఆకాశము - నూతన భూమియు
నూతన సంబంధము - యేసుతో మనకుండునూ
దూతగణములతో దివిగానములతో - నూతన యెరుషలేం దిగిరానైయున్నది
యేసుని రాజ్యం ఆనంద నిలయం - దేవుడే మనతో వసియించున్ నిరతం
2. పాపమునకు తావుండదు - శాపమే ఇక ఉండదు
మరణమె మరణించును - కన్నీరే ఇక ఉండదు.
యేసుని రూపులో మహిమ స్వరూపిలో - మార్పును పొంది జ్వలించెదమచట
యేసుని రాజ్యం నిత్య జీవము - దేవుడే మనతో వసియించున్ నిరతం
3. ఆకలి బాధుండదు దాహమె - గొనకుందువు
ఒంటరితనముండదు - నిట్టూర్పే నీకుండదు
యేసుని మాటలే - జీవాహారమై - జీవజలమును గ్రోలుదువచట
యేసుని రాజ్యం శాంతికి నిలయం - దేవుడె మనతో వసియించున్ నిరతం
1. nootana aakaashamu - nootana bhoomiyu
nootana sambandhamu - yesuto manakundunoo
dootaganamulato divigaanamulato -
nootana yerushalem digiraanaiyunnadi
yesuni raajyam aananda nilayam -
devude manato vasiyinchun niratam
2. paapamunaku taavundadu - shaapame ika undadu
maraname maraninchunu - kanneere ika undadu.
yesuni roopulo mahima svaroopilo -
maarpunu pondi jvalinchedamachata
yesuni raajyam nitya jeevamu -
devude manato vasiyinchun niratam
3. aakali baadhundadu daahame - gonakunduvu
ontaritanamundadu - nittoorpe neekundadu
yesuni maatale - jeevaahaaramai -
jeevajalamunu groluduvachata
yesuni raajyam shaantiki nilayam -
devude manato vasiyinchun niratam
Comments
Post a Comment