నీ వాత్మ యుద్ధములో - జయమొందుము

  నీ వాత్మ యుద్ధములో - జయమొందుము - ఓ నా సోదర
     వెనుకంజ వేయకు - ఓ నా సోదరీ వెనుకంజ వేయకు


1. స్వామి యేసు తన సిలువను మోసి - సైతాను రాజ్యము
    పూర్తిగా జయించెన్ - నీవును యేసుని వెంబడి వెళ్ళుమా llఓll 


2. శిరమున ముండ్ల మకుటము ధరించి - సిపాయిచే తలపై
    కొట్టబడె - నీవును యేసుని వెంబడి వెళ్ళుమా llఓll 


3. కల్వరిపైకి ఒంటరిగానే - వెళ్ళెను యేసు - త్యాగ సహితుడై
    నీవును ఆ దారినే వెళ్ళుమా llఓll 


4. లోకస్తులంతా నిద్రించు చుండగా - మోకాళ్ళపై యేసు
    కొండపై నుండె - నీవును ప్రార్థన శక్తినొందుమా llఓll 


5. సాహసమున నీ వాత్మ ఖడ్గమున- సైతాను బంధము
    ఖండించి వేసి - క్రీస్తుని సంఘమా - ముందంజ వేయుమా llఓll  nee vaatma yuddhamulo - jayamondumu - o naa sodara venukanja veyaku - o naa sodaree venukanja veyaku 1. svaami yesu tana siluvanu mosi - saitaanu raajyamu poortigaa jayinchen - neevunu yesuni vembadi vellumaa lloll 2. shiramuna mundla makutamu dharinchi - sipaayiche talapai kottabade - neevunu yesuni vembadi vellumaa lloll 3. kalvaripaiki ontarigaane - vellenu yesu - tyaaga sahitudai neevunu aa daarine vellumaa lloll 4. lokastulantaa nidrinchu chundagaa - mokaallapai yesu kondapai nunde - neevunu praarthana shaktinondumaa lloll 5. saahasamuna nee vaatma khadgamuna- saitaanu bandhamu khandinchi vesi - kreestuni sanghamaa - mundanja veyumaa lloll

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు