నాదు జీవమాయెనే నా సమస్తము
నాదు జీవమాయెనే నా సమస్తము నా సర్వస్వమేసుకే నాదు జీవము
నాదు దైవము ఇది దివ్య తేజము (2)
1. కృంగిన వేళ భంగపడినవేళ - నా దరికి చేర్చెను చుక్కానిలేని నావ వలె
నేనుండ - అద్దరికి చేర్చును - ఆత్మతో నింపెను ఆలోచన చెప్పెను ॥నాదు||
2. సాతాను బంధీనై కుములుచున్నవేళ విడిపించె శ్రీయేసుడే
రక్తమంతా కార్చి ప్రాణము బలిచేసి విమోచన దయచేసెను
సాతాను నణగద్రొక్క అధికార బలమిచ్చెనే llనాదుll
3. కారు మేఘాలే క్రమ్మిన వేళలో నీతి సూర్యుడు నడుపును
తుఫానులెన్నో చెలరేగి లేచినను నడుపును నా జీవిత నావ
త్వరలో ప్రభు దిగివచ్చును తరలి పోదును ప్రభునితో llనాదుll
Naadu jeevamaayene naa samastamu
naa sarvasvamesuke naadu jeevamu
Naadu daivamu idi divya tejamu (2)
1. krungina vela bhangapadinavela -
naa dariki cherchenu chukkaanileni naava vale
nenunda - addariki cherchunu -
aatmato nimpenu aalochana cheppenu ॥naadu||
2. saataanu bandheenai kumuluchunnavela
vidipinche shreeyesude
raktamantaa kaarchi praanamu
balichesi vimochana dayachesenu
saataanu nanagadrokka adhikaara
balamichchene llnaadull
3. kaaru meghaale krammina velalo
neeti sooryudu nadupunu
tuphaanulenno chelaregi lechinanu
nadupunu naa jeevita naava
tvaralo prabhu digivachchunu
tarali podunu prabhunito llnaadull
Comments
Post a Comment