ప్రభువా ! నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను

ప్రభువా ! నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను
నరులేమి చేయగలరు - భయమేమి లేదు నాకు ||ప్రభు||


1. గర్విష్టులైన వారు - నాతో పోరాడుచుండ
    ప్రతిమాట కెల్లనారు- పరభావ మెంచుచుండ
    ప్రభువా ! నాప్రక్క నుండి - నన్ను తప్పించినావు ||ప్రభు||


2. నేనెందు పోదమన్న - గమనించు చుండువారు
    నా వెంట పొంచియుండి - నను కృంగదీయ నెంచ
    ప్రభువా ! నాప్రక్క నుండి - నన్ను తప్పించినావు ||ప్రభు||


3. పగబూని వారు నన్ను - హతమార్చ జూచియున్న
    మరణంబు నుండి నన్ను - కడువింతరీతిగాను
    ప్రభువా ! నాప్రక్క నుండి - నన్ను తప్పించినావు ||ప్రభు||


4. జీవంపు వెలుగువైన - నీ సన్నిధానమందు
    నే సంచరించునట్లు - నే జారిపోకుండ
    ప్రభువా ! నాప్రక్క నుండి - నన్ను తప్పించినావు ||ప్రభు||


5. నన్నాదుకొంటి వీవు - నన్నాదరించినావు
    కొన్నావు నీవునన్ను మన్నించి నావు నన్ను
    ఎన్నాళ్ళు బ్రతికియున్న - నిన్నే సేవింతుదేవా
||ప్రభు|| Prabhuvaa ! ne ninnu nammi ninnaashrayinchinaanu Narulemi cheyagalaru - bhayamemi ledu naaku ||prabhu|| 1. garvishtulaina vaaru - naato poraaduchunda pratimaata kellanaaru- parabhaava menchuchunda prabhuvaa ! naaprakka nundi - nannu tappinchinaavu ||prabhu|| 2. nenendu podamanna - gamaninchu chunduvaaru naa venta ponchiyundi - nanu krungadeeya nencha prabhuvaa ! naaprakka nundi - nannu tappinchinaavu ||prabhu|| 3. pagabooni vaaru nannu - hatamaarcha joochiyunna maranambu nundi nannu - kaduvintareetigaanu prabhuvaa ! naaprakka nundi - nannu tappinchinaavu ||prabhu|| 4. jeevampu veluguvaina - nee sannidhaanamandu ne sancharinchunatlu - ne jaaripokunda prabhuvaa ! naaprakka nundi - nannu tappinchinaavu ||prabhu|| 5. nannaadukonti veevu - nannaadarinchinaavu konnaavu neevunannu manninchi naavu nannu ennaallu bratikiyunna - ninne sevintudevaa ||prabhu||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు