ప్రభువా నీకు తెరచితిని నా హృదయము

ప్రభువా నీకు తెరచితిని నా హృదయము నా హృదయము - ఓ శిల్పి
నిర్మాణికుడా ! నాలోనికి రమ్ము నీకు తగినట్లు నన్ను - నిర్మించుము నిర్మించుము నిర్మాణికుడా నిర్మించుము నిర్మాణికుడా ||ప్రభువా||


1. పిరికితనము - అవిశ్వాసము ఓడించెను నా జీవితము
    నిండు విశ్వాసము - మొండి ధైర్యము నాకు నేడే దయచేయుము  ॥ప్రభువా॥


2. శరీరేచ్ఛలు - ధన మోసము - ఓడించెను నా జీవితము
    నీ నడుపులో నిస్వార్ధము - నాకు నేడే దయచేయుము      ||ప్రభువా||


3. నా గర్వమే నాడంబమే ఓడించెను నా జీవితము
  నేను కాదింక నాలోన మీరే నివసించి నన్ను కరుణించుము ||ప్రభువా||


4. సాతానుకు లోబడితిని - ఓడించెను నా జీవితము
    దుష్టు నెల్లెడల - ఎదిరించే శక్తి - నాకు నేడే దయచేయుము   ||ప్రభువా||


5. అవిధేయత- అంధత్వము - ఓడించెను నా జీవితము
    చూచె కన్నులు - వినగల చెవులు - నాకు నేడే దయచేయుము  ||ప్రభువా|| Prabhuvaa neeku terachitini naa hrudayamu naa hrudayamu - o shilpi Nirmaanikudaa ! naaloniki rammu neeku taginatlu nannu - nirminchumu Nirminchumu nirmaanikudaa nirminchumu nirmaanikudaa ||prabhuvaa|| 1. pirikitanamu - avishvaasamu odinchenu naa jeevitamu nindu vishvaasamu - mondi dhairyamu naaku nede dayacheyumu ॥prabhuvaa॥ 2. shareerechchhalu - dhana mosamu - odinchenu naa jeevitamu nee nadupulo nisvaardhamu - naaku nede dayacheyumu ||prabhuvaa|| 3. naa garvame naadambame odinchenu naa jeevitamu nenu kaadinka naalona meere nivasinchi nannu karuninchumu ||prabhuvaa|| 4. saataanuku lobaditini - odinchenu naa jeevitamu dushtu nelledala - edirinche shakti - naaku nede dayacheyumu ||prabhuvaa|| 5. avidheyata- andhatvamu - odinchenu naa jeevitamu chooche kannulu - vinagala chevulu - naaku nede dayacheyumu ||prabhuvaa||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు