నా ప్రాణ ప్రియుడా యేసురాజా
నా ప్రాణ ప్రియుడా యేసురాజా అర్పింతును నా హృదయార్పణ
విరిగి నలిగిన ఆత్మతోను - హృదయపూర్వక ఆరాధనతో - సత్యముగా
1. అద్భుతకరుడా ఆలోచన - ఆశ్చర్య సమాధాన ప్రభువా
బలవంతుడా బహు ప్రియుడా - మనోహరుడా మహిమరాజా - స్తుతించెదన్ ॥నా॥
2. విమోచన గానములతో - సౌందర్య ప్రేమ స్తుతులతో
నమస్కరించి ఆరాధింతున్ - హర్షింతును నే పాడెదను - నా ప్రభువా ॥నా॥
3. రక్షణలంకారములను - అక్షయమగు నీ ఆహారమున్
రక్షకుడా నా కొసగితివి - దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతించెదన్ ॥నా॥
4. గర్భమున పుట్టిన బిడ్డను - కరుణింపక తల్లి మరచునా
మరచిన గాని నీ వెన్నడు - మరువవు విడువవు ఎడబాయవు - కరుణరాజా ॥నా॥
5. నీ నీతిని నీ రక్షణను - నా పెదవులు ప్రకటించును
కృతజ్ఞతా స్తుతులతోడ - నీ ప్రేమను - నే వివరింతును - విమోచకా ॥నా॥
6. వాగ్దానముల్ నాలో నెరవేరెన్ - విమోచించి నా కిచ్చితివే
పాడెదను ప్రహర్షింతును - హల్లెలూయా హల్లెలూయా - హల్లెలూయ ॥నా॥
Naa praana priyudaa yesuraajaa arpintunu naa hrudayaarpana
Virigi naligina aatmatonu - hrudayapoorvaka aaraadhanato -
satyamugaa
1. adbhutakarudaa aalochana - aashcharya samaadhaana prabhuvaa
balavantudaa bahu priyudaa - manoharudaa mahimaraajaa -
stutinchedan ॥naa॥
2. vimochana gaanamulato - saundarya prema stutulato
namaskarinchi aaraadhintun - harshintunu ne paadedanu -
naa prabhuvaa ॥naa॥
3. rakshanalankaaramulanu - akshayamagu nee aahaaramun
rakshakudaa naa kosagitivi - deekshato ninnu veekshinchuchu
stutinchedan ॥naa॥
4. garbhamuna puttina biddanu - karunimpaka talli marachunaa
marachina gaani nee vennadu - maruvavu viduvavu edabaayavu -
karunaraajaa ॥naa॥
5. nee neetini nee rakshananu - naa pedavulu prakatinchunu
krutajnyataa stutulatoda - nee premanu - ne vivarintunu -
vimochakaa ॥naa॥
6. vaagdaanamul naalo neraveren - vimochinchi naa kichchitive
paadedanu praharshintunu - hallelooyaa hallelooyaa -
hallelooya ॥naa॥
Comments
Post a Comment