నీతిగల యెహోవా స్తుతి మీ

నీతిగల యెహోవా స్తుతి మీ - యాత్మతో నర్పించుడి - మీయాత్మతో
సేవించుడి = దాతయౌ మన క్రీస్తు నీతిని - దాల్చుకొని సేవించుడి llనీతిగలll


1. చదల బుడమియు రవియు జలధియు - నదులు గిరులును
    జక్కగా సదమలంబగు దైవనామము - సర్వదా నుతిజేయను

2. సర్వశక్తుని కార్యముల కీ - సర్వరాష్ట్రము లన్నియు = గర్వములు
    విడి తలలు వంచుచు - నుర్విలో నుతిజేయను


3. గీత తాండవ వాద్యములచే - బ్రీతిపరచెడు సేవతో = పాతకంబులు
    పరిహరించెడు = దాతనే సేవించుడి


4. పరమదూతలు నరులు పుడమిని - మొదలుబెట్టుచు దేవుని = పరము
    నందున్నట్టి యేసుని - పాదములు సేవింతురు


5. ఇలను భక్తులు గూడుకొనియా - బలము గల్గిన దేవుని = వెలయు
    స్తుతి వే నోళ్లతోడను - విసుగు జెందకజేయుడి 


6. ఆత్మ నీవిక మేలుకొని శు - ద్ధాత్మ యేసుని దండ్రిని=త్రిత్వ
    మగునా యేక దేవుని - హర్షమున సేవింపవే neetigala yehovaa stuti mee - yaatmato narpinchudi - meeyaatmato sevinchudi = daatayau mana kreestu neetini - daalchukoni sevinchudi llneetigalall 1. chadala budamiyu raviyu jaladhiyu - nadulu girulunu jakkagaa sadamalambagu daivanaamamu - sarvadaa nutijeyanu 2. sarvashaktuni kaaryamula kee - sarvaraashtramu lanniyu = garvamulu vidi talalu vanchuchu - nurvilo nutijeyanu 3. geeta taandava vaadyamulache - breetiparachedu sevato = paatakambulu pariharinchedu = daatane sevinchudi 4. paramadootalu narulu pudamini - modalubettuchu devuni = paramu nandunnatti yesuni - paadamulu sevinturu 5. ilanu bhaktulu goodukoniyaa - balamu galgina devuni = velayu stuti ve nollatodanu - visugu jendakajeyudi 6. aatma neevika melukoni shu - ddhaatma yesuni dandrini=tritva magunaa yeka devuni - harshamuna sevimpave

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు