ప్రభు ప్రేమ తొలికేక
ప్రభు ప్రేమ తొలికేక - హృదయములో ప్రతిధ్వనియించే
పాపక్షమ యేసునిలో - శరణునొసంగుచు కనిపించె ||ప్రభు||
1. పాపవికారము పొడసూప - జీవిత విలువలు మరుగాయె
పతితనుగా లోకములో - బ్రతుకుటయే నాగతి యాయె
పలువురిలో కనబడలేక - దాహముతో నే నొంటరిగా
బావి కని పయనింప - నాధుని దర్శన మెదురాయె
పావనుడు దాహముతో - జలమును యిమ్మని ననుగోరె. ||ప్రభు||
2. జాతిని చూడని నేత్రముతో - పాపముసోకని హృదయముతో
జాలిని చాటించుచునే - తాకెను నా మది వేదనతో
జాప్యము చేయక తెమ్మనియే - దాచుకొనిన నా పాపమును
జడియుచునే తెలిపితిని - ప్రభు వెరిగిన నా నిజస్థితిని
జయమొందె నా తనువు - సరిగ నుడితివని ప్రభు దెలుప. ||ప్రభు||
3. దేహమునే నా సర్వముగా - భావించుచు మది పూజింప
దినదినము జీవితము - చావుగ మారిన కాలములో
దేవునిగానా బంధువుగా - మరణ బంధములు ఛేదించి
దరిజేర్చి దీవించి - నూతన జన్మ ప్రసాదించె
దెయ్యాల కుహరమును - స్తుతి మందిరముగ రూపించ llప్రభు||
4. పాపము దాగొను నా బావి - లోతును యెరిగినవారెవరు
పోరాట వాటిక యౌ - నా బ్రతుకును జూచినదెవరు
పాపికిని పాపమునకును - భేదము జూపిన వారెవరు
పాపిని కాపాడుటకై - సిలువ భరించిన వారెవరు
పరదైసు ద్వారములు - ప్రేమతో తెరిచెను నా కొరకై. |ప్రభు||
5. ఘటముతో వెడలితి నొంటరిగా - పితరులు ద్రావిన జలములకై
కనబడెను బావి కడ - రక్షణ యూటల ప్రభుయేసు
కుండను వీడి పరుగిడితి - బావిని జేకొని హృదయములో
ఘనమైన శుభవార్త - ఆతృతతో ప్రజలకు దెలుప కనుగొనిరి గ్రామ
ప్రజల్ - విశ్వవిమోచకుడగు యేసున్ llప్రభు|| prabhu prema tolikeka - hrudayamulo pratidhvaniyinche paapakshama yesunilo - sharanunosanguchu kanipinche ||prabhu|| 1. paapavikaaramu podasoopa - jeevita viluvalu marugaaye patitanugaa lokamulo - bratukutaye naagati yaaye paluvurilo kanabadaleka - daahamuto ne nontarigaa baavi kani payanimpa - naadhuni darshana meduraaye paavanudu daahamuto - jalamunu yimmani nanugore. ||prabhu|| 2. jaatini choodani netramuto - paapamusokani hrudayamuto jaalini chaatinchuchune - taakenu naa madi vedanato jaapyamu cheyaka temmaniye - daachukonina naa paapamunu jadiyuchune telipitini - prabhu verigina naa nijasthitini jayamonde naa tanuvu - sariga nuditivani prabhu delupa. ||prabhu|| 3. dehamune naa sarvamugaa - bhaavinchuchu madi poojimpa dinadinamu jeevitamu - chaavuga maarina kaalamulo devunigaanaa bandhuvugaa - marana bandhamulu chhedinchi darijerchi deevinchi - nootana janma prasaadinche deyyaala kuharamunu - stuti mandiramuga roopincha llprabhu|| 4. paapamu daagonu naa baavi - lotunu yeriginavaarevaru poraata vaatika yau - naa bratukunu joochinadevaru paapikini paapamunakunu - bhedamu joopina vaarevaru paapini kaapaadutakai - siluva bharinchina vaarevaru Paradaisu dvaaramulu - premato terichenu naa korakai. |prabhu|| 5. ghatamuto vedaliti nontarigaa - pitarulu draavina jalamulakai kanabadenu baavi kada - rakshana yootala prabhuyesu kundanu veedi parugiditi - baavini jekoni hrudayamulo ghanamaina shubhavaarta - aatrutato prajalaku delupa kanugoniri graama prajal - vishvavimochakudagu yesun llprabhu||
Comments
Post a Comment