మహిమాన్వితుడౌ ప్రభుని - బహుశ్రేష్టమౌ వాక్యమును

మహిమాన్వితుడౌ ప్రభుని - బహుశ్రేష్టమౌ వాక్యమును
పరిపూర్ణ హృదయముతో - ధరయంతయు వినవలెను

1. ఆ వాక్యమేది?  అనాదియందు ఆవిర్భవించినది
    స్థిరముగా నీ మహీస్థలిలో - యేసుండు వెలసెగదా
    ఆ వాక్యము దేవునిది - ఆ వాక్యము దేవుడెగా      llమహిll


2. లోకంబునందు - లోకస్తులెల్ల నా కంబుచేరుటకు
    సుఖతరమౌ - సుమార్గమిదే - యేసున్ భజియించుటయే
    ఆ యేసెగదా వాక్యం - ఈ యేసెగదా మార్గం          llమహిll


3. ఆకాశమందు దూతాళిస్తోత్రం - గీతాలు పాడిరిగా
    నరరూపము - ధరించినదీ - శ్రీయేసు క్రీస్తుడెగా
    ఆ యేసుని నమ్ముటయే - నీ రక్షణ స్థిరపడుట       llమహిll


4. స్తోత్రంబు తండ్రి - స్తోత్రంబు వాక్యం - స్తోత్రంబు మా
    యేసయ్య ఆదిని యిప్పు- డెల్లప్పుడు - స్తోత్రంబు మీ కగును
    పరభూలోకములందు - స్థిరమౌనుగ స్తోత్రములు      llమహిll Mahimaanvitudau prabhuni - bahushreshtamau vaakyamunu Paripoorna hrudayamuto - dharayantayu vinavalenu 1. aa vaakyamedi? anaadiyandu aavirbhavinchinadi sthiramugaa nee maheesthalilo - yesundu velasegadaa aa vaakyamu devunidi - aa vaakyamu devudegaa llmahill 2. lokambunandu - lokastulella naa kambucherutaku sukhataramau - sumaargamide - yesun bhajiyinchutaye aa yesegadaa vaakyam - ee yesegadaa maargam llmahill 3. aakaashamandu dootaalistotram - geetaalu paadirigaa nararoopamu - dharinchinadee - shreeyesu kreestudegaa aa yesuni nammutaye - nee rakshana sthirapaduta llmahill 4. stotrambu tandri - stotrambu vaakyam - stotrambu maa yesayya aadini yippu- dellappudu - stotrambu mee kagunu parabhoolokamulandu - sthiramaunuga stotramulu llmahill

Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో