నావన్ని యంగీకరించుమీ - దేవా - నన్నెపుడు

నావన్ని యంగీకరించుమీ - దేవా - నన్నెపుడు నీవు కరుణించుమీ =
నావన్ని కృపచేత - నీ వలన నొందిన - భావంబునను నేను - బహు ధైర్యమొందెద


1. నీకు నా ప్రాణము - నిజముగా నర్పించి =
    నీకు మీదుగట్టి - నీకొరకు నిల్పెద      ॥నావన్ని॥


2. సత్యంబు నీ ప్రేమ - చక్కగా మదిబూని =
    నిత్యంబు గరముల - నీ సేవ జేసెద    ॥నావన్ని॥


3. నీ సేవ జరిగెడు - నీయాలయమునకు =
    నాసచే నడిపించు - మరల నా పదములు      ॥నావన్ని॥


4. పెదవులతో నేను - బెంపుగ నీ వార్త =
    గదలక ప్రకటింప - గలిగించు దృడభక్తి         ॥నావన్ని॥


5. నా వెండి కనకంబు - నా తండ్రి గైకొనుమీ =
    యావంతయైనను - నాశింప మదిలోన      ॥నావన్ని॥


6. నీవు నాకొసగిన - నిర్మల బుద్ధిచే =
    సేవ జేయగ నిమ్ము - స్ధిర భక్తితో నీకు        ॥నావన్ని॥


7. చిత్తము నీ కృపా - యత్తంబు గావించి =
    మత్తిల్లకుండగ – మార్గంబు దెలుపుము      ॥నావన్ని॥


8. హృదయంబు నీకిత్తు - సదనంబుగావించి =
    పదిలంబుగా దాని - బట్టి కాపాడుము        ॥నావన్ని॥ Naavanni yangeekarinchumee - devaa - nannepudu neevu karuninchumee = Naavanni krupacheta - nee valana nondina - bhaavambunanu nenu - bahu dhairyamondeda 1. neeku naa praanamu - nijamugaa narpinchi = neeku meedugatti - neekoraku nilpeda ॥naavanni॥ 2. satyambu nee prema - chakkagaa madibooni = nityambu garamula - nee seva jeseda ॥naavanni॥ 3. nee seva jarigedu - neeyaalayamunaku = naasache nadipinchu - marala naa padamulu ॥naavanni॥ 4. pedavulato nenu - bempuga nee vaarta = gadalaka prakatimpa - galiginchu drudabhakti ॥naavanni॥ 5. naa vendi kanakambu - naa tandri gaikonumee = yaavantayainanu - naashimpa madilona ॥naavanni॥ 6. neevu naakosagina - nirmala buddhiche = seva jeyaga nimmu - sdhira bhaktito neeku ॥naavanni॥ 7. chittamu nee krupaa - yattambu gaavinchi = mattillakundaga – maargambu delupumu ॥naavanni॥ 8. hrudayambu neekittu - sadanambugaavinchi = padilambugaa daani - batti kaapaadumu ॥naavanni॥

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు