నా సంకటంబులన్నియు తీరిపోయె

నా సంకటంబులన్నియు తీరిపోయె - సంహారదూత నన్ను దాటిపోయె

1. గొట్టెపిల్ల విలువైన రక్తములో - కడుగబడి నేను రక్షణ బొందితిన్        ॥నా॥


2. ఫరోకు నేనింక దాసుడను కాను - పరమ కానానుకు హక్కుదారుడను  ॥నా॥


3. మారాను మధురముగ మార్చినవాడు - బండను పగులగొట్టి దాహం దీర్చెను ॥నా॥


4. మనోహరముగ నున్న కానాన్ రాజ్యము - అదే నాకు స్థిరమైన యవకాశము ॥నా॥


5. ఆనందమే పరమానందమే - కానాన్ జీవితము నాకు ఆనందమే ॥నా॥


6.అరణ్యజీవితమున యేసునాధుడు -ప్రతిదినం నూతనమన్నా నాకు యిచ్చును ॥నా॥


7. నా బలము నా ఆశ్రయము - నా రక్షణ యేసయ్య హల్లెలూయ ॥నా॥ Naa sankatambulanniyu teeripoye - sanhaaradoota nannu daatipoye 1. gottepilla viluvaina raktamulo - kadugabadi nenu rakshana bonditin ॥naa॥ 2. pharoku neninka daasudanu kaanu - parama kaanaanuku hakkudaarudanu ॥naa॥ 3. maaraanu madhuramuga maarchinavaadu - bandanu pagulagotti daaham deerchenu ॥naa॥ 4. manoharamuga nunna kaanaan raajyamu - ade naaku sthiramaina yavakaashamu ॥naa॥ 5. aanandame paramaanandame - kaanaan jeevitamu naaku aanandame ॥naa॥ 6.aranyajeevitamuna yesunaadhudu - pratidinam nootanamannaa naaku yichchunu ॥naa॥ 7. naa balamu naa aashrayamu - naa rakshana yesayya hallelooya ॥naa॥

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు