నాకై చీల్చబడ్డ యో - నా యనంత నగమా
1. నాకై చీల్చబడ్డ యో - నా యనంత నగమా - నిన్ను డాగి యుందును
చెన్ను మీర బారెడు - రక్త జల ధారలా - సక్తి గ్రోలగా నిమ్ము
2. నేను నాదు శక్తిచే - నిన్ను గొల్వజాలను - కాల మెల్ల నేడ్చినన్
వేల క్రతుల్ చేసినన్ - నేను చేయు పాపము - నేనె బాపజాలను
3. వట్టి చేయి చాచుచున్ - ముట్టి సిల్వ జేరెదన్ - దిక్కు లేని పాపిని
ప్రక్క జేర్చి ప్రోవుము నా కళంక మెల్లను యేసునాధ్, బాపుము
4. ఈ ధరిత్రియందున - నేరు దాటునప్పుడు - నాదరించి నీ కడన్
నాకై చీల్చబడ్డాయో - నా యనంత శైలమా - నన్ను జేర దీయుమా
1. naakai cheelchabadda yo - naa yananta nagamaa -
ninnu daagi yundunu
chennu meera baaredu - rakta jala dhaaralaa -
sakti grolagaa nimmu
2. nenu naadu shaktiche - ninnu golvajaalanu -
kaala mella nedchinan
vela kratul chesinan - nenu cheyu paapamu -
nene baapajaalanu
3. vatti cheyi chaachuchun - mutti silva jeredan -
dikku leni paapini
prakka jerchi provumu naa kalanka
mellanu yesunaadh, baapumu
4. ee dharitriyanduna - neru daatunappudu -
naadarinchi nee kadan
naakai cheelchabaddaayo - naa yananta shailamaa -
nannu jera deeyumaa
Comments
Post a Comment