మన బలమైన దేవాది దేవుని రాజ్యము సమీపమగుచున్నది

మన బలమైన దేవాది దేవుని రాజ్యము సమీపమగుచున్నది
తన కృపకాలము అతిత్వరితముగ ఇల - గతియింపనై యున్నది


1. ఆకలిదప్పులుండవచట - వ్యాధిబాధలు లేవచట
    విలాపములకు రోదన ధ్వనులకును - తావు లేదచ్చట    ॥మన॥


2. తోడేళ్ళును గొర్రెపిల్లయు - కలిసి వాసము చేయును
    తన పరిశుద్ధపర్వత మంతటను - అవి హానికలిగించవు    ॥మన॥


3. సంతోష సునాదములు - నీతి సమాధానములు
    ఆ రాజ్యమునకు ఆధారములై - అవి నిలుచు కలకాలం  llమనll


4. అక్షయ రాజ్యము నియ్య - రక్షకుడే నిను పిలువ
    తక్షణ మాయన సైన్యములో చేరి - సాగిపోయెదము     ॥మనll

Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో